ఖమ్మం జిల్లా సమగ్ర పంటలకు చిరునామాగా నిలవాలి: మంత్రి పువ్వాడ

Related image

నియంత్రిత సాగు విధానంపై నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెం గ్రామంలో రైతులకు అవగాహన సదస్సులో ముఖ్య అతిధిగా హాజరైన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.

తొలుత గ్రామంలో నిర్మించిన వైకుంఠ ధామంను వారు ప్రారంభించారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణంలో నిర్వహించిన సదస్సులో వారు మాట్లాడుతూ.. "ఖమ్మం జిల్లా సమగ్ర పంటలకు చిరునామాగా మారాలి. ప్రతి క్లుస్టర్ పరిధిలో రైతు వేదికలు విధిగా ఏర్పాటు చేసుకోవాలి. గ్రామాల్లోని ముందుగా ప్రభుత్వ భూములను చూసుకుని వేదికలు నిర్మించుకోవాలి. దాతలు ముందుకొచ్చి విరాళంగా నిర్మాణం చేసి ఇస్తే తమకు నచ్చిన వారి స్మారకంగా పేర్లు పెట్టుకోవడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.

రైతు చుట్టూనే ప్రభుత్వ పాలన కొనసాగుతుంది. ప్రభుత్వం  ఏది చేసినా రైతు కోణం నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచన చేస్తున్నారు. నేడు మనం దేశానికి అన్నం పెట్టే స్థితికి నేడు తెలంగాణ చేరుకుంది. ఇది మన ప్రభుత్వం సాధించిన ప్రగతి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ముందుచూపుతో తెలంగాణ దశ తిరిగింది. ఇక్కడ ఉన్న వాతావరణ, భౌగోళిక పరిస్థితులు దేశంలో మరెక్కడా లేవు.

ఆరేళ్ల  కేసీఆర్ గారి పాలనతో అభివృద్ది వైపు కొనసాగుతుంది. వ్యవసాయం బాగుపడితే గ్రామాలు బాగుపడతాయని వినూత్న పథకాలను చేపట్టారు. రైతుల బాగుకోసమే సమగ్ర వ్యవసాయ విధానం తీసుకొచ్చారు.

రైతులు లాభసాటిగా వ్యవసాయం చేసుకోవాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. ఈ సారి మొక్కజొన్న అధికంగా దిగుబడి వచ్చాయి. మరో ఏడాది వాడినా నిలువలు తరిగిపోవు. అందుకే మొక్కలు సాగు చేసి రైతు నష్టపోకూడదన్నది ప్రభుత్వ ఆలోచన. అందుకు మొక్కకు ప్రత్యామ్నాయంగా కందులు, పత్తి, తెలంగాణ సోనా వేయమని ప్రభుత్వం సూచిస్తుంది. సన్న వరి తెలంగాణ సోనా సాగు పై రైతులు దృష్టి సారించాలి. చెరుకును ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. డిమాండ్ ఉన్న పంటలతోనే రైతులకు లాభం వస్తుంది. ఆ దిశగా రైతులను ప్రోత్సహించేందుకే ప్రభుత్వ సూచనలు చేస్తుంది. అన్ని పంటలలో నూతన వంగడాలతో రైతుల దిగుబడులు పెంచే దిశగా ప్రభుత్వ చర్యలు చేపట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలు, డిమాండ్ ఉన్న పంటలు, పంటల నిలువకు గోడౌన్లు ప్రతి అంశాన్ని ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది. ప్రతి పంటకు ముందు వ్యవసాయ శాఖ ద్వారా భూసార పరీక్షలు.  రైతు వేదికల ద్వారా రైతులకు సాగులో మెలకువలపై శిక్షణ ఇవ్వనుంది. తెలంగాణ రైతును బతుకుతామన్న భరోసా కేసీఆర్ గారు కల్పించారు. తనతో పాటు రైతు మరో నలుగురిని బతికించగలమన్న స్థితికి రావాలన్నది కేసీఆర్ గారి ఆకాంక్ష. జిల్లాలోని ప్రతి ఎకరాకు గోదావరి జలాలను అందించాలన్నదే ప్రభుత్వ సంకల్పం. అందుకే సీతారామకు 12 వేల కోట్లు అదనంగా కేటాయించి, ఎన్ఎస్పి ఆయకట్టుకు స్థిరీకరిస్తున్నాం. సాగులో లేని ప్రతి ఎకరాను సాగులోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రభుత్వం సూచించిన పంటలను వేయకపోతే రైతు బంధు ఇవ్వరా అనే అపోహలు వొద్దు. రైతు బంధు పథకంను ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదని ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ప్రభుత్వం సూచించిన విధంగా పంటలు వేసి సహకరించాలని రైతులను కోరుతున్న".అని అన్నారు.

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ RV కర్ణన్ IAS, ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వర రావు, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, రైతులు, సర్పంచులు,  జడ్పీటీసీలు, ఎంపిటిసిలు అధికారులు ఉన్నారు.

More Press Releases