ప్రతి పేదకు రెండు పడకల ఇల్లు ఇస్తాం: తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి

ప్రతి పేదకు రెండు పడకల ఇల్లు ఇస్తాం: తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి
  • ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం మేరకే ఇండ్ల నిర్మాణాలు
  • ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినవి అమలులోకి
  • మౌలిక సదుపాయాల కల్పనలో తెలంగాణ టాప్
  • నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలకు పెద్దపీట
  • లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత
  • రోల్ మోడల్ గా రెండుపడకల ఇండ్ల కాలనీలు
  • డ్రైనేజీలతో పాటు రహదారుల నిర్మాణాలు
  • లబ్ధిదారులు విధిగా మొక్కలు పెంచాలి
  • సూర్యపేట నియోజకవర్గ పరిధిలోని చివ్వేంల మండలం గుంపుల తిరుమలగిరిలో 80 రెండు పడకల ఇండ్ల ప్రారంభోత్సవం
  • ఏకకాలంలో 80 మంది లబ్ధిదారుల గృహ ప్రవేశాలు
ప్రతి పేదవారికి రెండు పడకల ఇల్లు నిర్మించి ఇస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం మేరకే ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని విదిగా అమలు పరిచేందుకు అడుగులు పడుతున్నాయన్నారు. సూర్యపేట నియోజకవర్గ పరిధిలోని చివ్వేంల మండలం గుంపుల తిరుమలగిరి వద్ద ఐదు కోట్ల 8 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన 80 రెండు పడకల ఇండ్లను ఆయన గురువారం ఉదయం ప్రారంభించారు.

తిరుమలగిరిలో రెండు పడకల ఇండ్లు నిర్మించాలి అన్నది 8 సంవత్సరాల క్రితమే నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఏకకాలంలో 80 మంది లబ్ధిదారులు గృహప్రవేశం జరుపుకోవడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. రెండు పడకల ఇండ్ల నిర్మాణం నాణ్యతలో ఎటువంటి రాజీ లేదని అదే సమయంలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగిందని ఆయన స్పష్టం చేశారు. రెండు పడకల ఇండ్ల నిర్మాణం జరిగిన కాలనీలు రోల్ మోడల్ గా ఉండేలా మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు.

మౌలిక సదుపాయాల కల్పనలో యావత్ భారతదేశంలోనే తెలంగాణ టాప్ లో ఉందన్నారు. రెండు పడకల ఇండ్ల నిర్మాణం జరిగిన కాలనిలో రహదారులు,డ్రైనేజీ నిర్మాణాలు ఉంటాయన్నారు. రెండుపడకల ఇండ్ల లబ్ధిదారులు విధిగా మొక్కలు పెంచేందుకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
G Jagadish Reddy
Telangana

More Press News