ఏడాది పాలనకు ప్రజల నీరాజనం: ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు

ఏడాది పాలనకు ప్రజల నీరాజనం: ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు
  • గత ఏడాది దేశంలో చరిత్ర సృష్టించిన రోజు.. నేటితో ఏడాది
  • వైఎస్ఆర్సిపి పాలనకు 100 మార్కులు అని, ప్రజలు నీరాజనం పడుతున్నారన్న మంత్రి వెల్లంపల్లి
  • సంబరాల్లో భాగంగా నగరంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి
  • తొలుత ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్ లో వైయస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు
  • అనంతరం ప్రజలకు పళ్ళు పంపిణీ, పేదలకు బియ్యం, నిత్యవసర సరుకులు అందజేత
విజయవాడ: 40 సంవత్సరాల అనుభవం అని చెప్పుకుంటున్న బాబు పాలనలో చేయలేని పనులను 40 సంవత్సరాల యువకుడు ఏడాది పాలనలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 90 శాతం పూర్తి చేశారని మంత్రి వెల్లంపల్లి అన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కరోనా నివారణకు చర్యలు చేపడుతూనే సంక్షేమ పథకాలను ధీటుగా అమలు చేయగలిగారని అన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పని చేయడం గర్వకారణమని మంత్రి తెలిపారు. చిన్న పరిశ్రమలు చేయూత ఇస్తానన్న బాబు చెయ్యి ఇచ్చాడని, జగన్ మోహన్ రెడ్డి గత ఏడాది అప్పులు ఈ ఏడాదితో కలిపి రూ.950 కోట్ల రూపాయలను విడుదల చేశారని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మనసున్న నాయకుడని తెలిపారు. రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.
Vellampalli Srinivasa Rao

More Press News