నియంత్రిత విధానంలో సాగు చేసి రైతు రాజు కావాలి: మంత్రి సత్యవతి రాథోడ్

Related image

  • మన అవసరాలు తీరేటట్లు, మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలు పండించాలి
  • గతంలో బోర్లు, బావులపై ఆధారపడితే సిఎం కేసిఆర్ అపరభగీరథ ప్రయత్నం వల్ల నేడు కాళేశ్వరం, దేవాదుల, ఎస్సారెస్పీ కాలువల ద్వారా నీరు వస్తోంది
  • రైతుబంధు, 24 గంటల ఉచిత కరెంటు వల్ల రైతులు కౌలుకివ్వకుండా సాగు చేసుకుంటున్నారు
  • దాదాపు 30వేల కోట్ల రూపాయలతో రైతుల ధాన్యం కొనుగోలు
  • దేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేయడం లేదు
  • అధికారులు నిత్యం రైతులకు అందుబాటులో ఉండి మార్గనిర్ధేశనం చేయాలి, కావల్సినవి అందించాలి
  • ములుగు జిల్లాలో నియంత్రిత సాగు అవగాహన కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్
ములుగు, మే 23 : తెలంగాణ రైతు రాజు కావాలన్న ముఖ్యమంత్రి కేసిఆర్ ఆలోచనకనుగుణంగా నియంత్రిత విధానంలో వ్యవసాయం చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ రైతులను కోరారు. ఎంత పంట పండించినా గిట్టుబాటు ధర రాకుండా ఆందోళన చెందే పరిస్థితి రావద్దని, మన అవసరాలు, మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా నాణ్యమైన పంటలు పండించి రైతులు లాభపడాలని ఆకాంక్షించారు.

నియంత్రిత సాగుపై ములుగు జిల్లాలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో నేడు మంత్రి సత్యవతి రాథోడ్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఎంపీ మాలోతు కవిత, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఇతర అధికారులు, నేతలు పాల్గొన్నారు. గతంలో దాదాపు 40 లక్షల బోర్లు, బావుల ద్వారా సాగు జరుగుతుండగా ముఖ్యమంత్రి కేసిఆర్ అపర భగీరథ కృషి వల్ల నేడు కాళేశ్వరం, దేవాదుల, ఎస్సారెస్పీ ద్వారా నీళ్లు వస్తున్నాయన్నారు. అదేవిధంగా రైతు బంధు, 24 గంటల కరెంటు ఇవ్వడం వల్ల నేడు రైతులు తమ భూమిని కౌలుకు ఇవ్వకుండా స్వంతంగా సాగు చేసుకుంటున్నారని, తద్వారా యాసంగిలోనే మన రాష్ట్రంలో రికార్డు స్థాయి దిగుబడి వచ్చిందన్నారు.

రైతులు పెద్ద ఎత్తున ధాన్యం పండించినా , కరోనా కష్టకాలంలో కూడా రైతులు నష్టపోవద్దనే గొప్ప ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసిఆర్ గారు ఎక్కడికక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతు పండించిన చివరి గింజను కూడా కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. ఇందుకోసం దాదాపు 30వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి దేశంలో కేసిఆర్ గారు ఒక్కరేనన్నారు. రైతులు కూడా ఇది గమనించి మన అవసరాలు ఏమున్నాయి, మార్కెట్ లో డిమాండ్ దేనికుందో గమనించి, ప్రభుత్వ సలహాల మేరకు సాగు చేయడం వల్ల మరింత లబ్ధి పొందుతారన్నారు.

మన దగ్గర అత్యధిక పంటలు పండినా ఇతర ప్రాంతాల నుంచి దిగుబడి చేసుకునే పరిస్థితి ఉన్నందున, దీనిని పొగట్టడానికి ప్రభుత్వం చెప్పినట్లు నియంత్రిత విధానంలో సాగు చేసి మనకు కావల్సినవి మనం పండించుకోవడంతో పాటు మార్కెట్ లో మంచి ధర పలికే ధాన్యాన్ని పండించాలని కోరారు. ఇందుకోసం అధికారులు కూడా రైతులకు నిత్యం వెన్నంటి ఉండాలని, సరైన మార్గదర్శనం చేస్తూ వారికి కావల్సిన విత్తనాలు, ఎరువులు, పెస్టిసైడ్స్ ఎప్పటికప్పడు అందేలా చూడాలన్నారు.

More Press Releases