నియంత్రిత వ్యవసాయ సాగు విధానంపై జిల్లా స్థాయి అవగాహన సదస్సు - ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి హరీష్ రావు

Related image

సంగారెడ్డిలో నియంత్రిత వ్యవసాయ సాగు విధానంపై జిల్లా స్థాయి అవగాహన సదస్సు - ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి హరీష్ రావు:

మంత్రి హరీష్ రావు కామెంట్స్:

  • సాగు లాభసాటిగా మారాలని, అన్నదాత ఆత్మగౌరవంగా బతకాలని కొత్త విధానం తీసుకొచ్చారు
  • ప్రస్తుత ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు, విత్తనాలు, ఎరువుల కొరత, విద్యుత్ కోత
  • 1.40లక్షల ఎకరాలకు 14వేల కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఇస్తాం
  • వానాకాలం పంటకు సంబంధించిన 7వేల కోట్ల రూపాయల్లో 3500కోట్లు ఇప్పటికే వ్యవసాయ శాఖ ఖాతాలో జమ చేశాం
  • వానా కాలంలో మక్కల దిగుబడి తక్కువగా వస్తుంది. అది దిగుబడి వచ్చే సమయంలో వర్షం వస్తుంది. అందుకే వేసవిలో మక్కలు వేసుకోవాలి అని చెబుతున్నాం
  • ఈ సంవత్సరం సంగారెడ్డి జిల్లాలో 3.60లక్షల ఎకరాల్లో పత్తి సాగు లక్ష్యం
  • వచ్చే సంవత్సరం పత్తికి మంచి డిమాండ్ ఉంటుంది
  • సంగారెడ్డి జిల్లాలో వానకాలంలో 25వేల ఎకరాల్లో మక్కలు సాగు చేస్తున్నారు. రైతులు దీనికి ప్రత్యామ్నాయం ఆలోచించాలి
  • కందుల ఉత్పత్తి ఎంత వచ్చినా.. మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
  • ఒకే పంట వేస్తే క్రమంగా భూమిలో సారం తగ్గుతుంది. అందుకే పంటలు మార్చాలి
  • జిల్లా అవసరాలకు అనుగుణంగా ఎరువులు తెప్పించాం
  • రైతులు ఎరువులు తక్కువగా వినియోగించాలి
  • రైతు బంధు వేదికల నిర్మాణం కోసం ప్రభుత్వం 20లక్షల రూపాయలు కేటాయించింది
  • నాలుగు నెలల్లో నిర్మాణాం పూర్తి చెయ్యాలి
  • రైతు బంధు వేదికల నిర్మాణం కోసం దాతలు ముందుకు వచ్చేలా ప్రోత్సహించాలి
  • కొత్త వ్యవసాయ విధానంపై గ్రామ స్థాయిలో రైతులకు అవగాహన కల్పించేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలి
  • ఒకరికొకరు పోటీ పడి నూతన వ్యవసాయ విధానం ముందుకు తీసుకుపోవాలి
  • సంగారెడ్డి జిల్లాలో 20503 మంది రైతులకు ఒకే దఫలో రుణ మాఫీ జరిగింది
  • మిగిలిన రైతులకు దశల వారీగా మాఫీ చేస్తాం

More Press Releases