పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన హిమాన్హు శుక్లా

పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన హిమాన్హు శుక్లా
  • క్షేత్ర స్దాయికి ప్రభుత్వ పధకాలు చేరుకునేలా కృషి: సంయుక్త కలెక్టర్ హిమాన్హు శుక్లా
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్ధను మరింత బలోపేతం చేయటం ద్వారా సగటు ప్రజలకు సైతం ప్రభుత్వ పధకాలు పూర్తి స్దాయిలో చేరేలా చర్యలు తీసుకుంటామని పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ హిమాన్హు శుక్లా తెలిపారు. జిల్లాకు నూతనంగా సంయుక్త కలెక్టర్ గా నియమితులైన శుక్లా బుధవారం ఉదయం ఏలూరు జిల్లా పరిషత్త్ కార్యాలయంలో తనకు కేటాయించిన ఛాంబర్ లో బాధ్యతలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా శుక్లా మాట్లాడతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముంగిటకే ప్రభుత్వ సేవలు తీసుకువెళ్లాలన్న లక్ష్యంతో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్ధను తీసుకువచ్చిందని, ఆ క్రమంలోనే నూతనంగా సంయుక్త కలెక్టర్లుగా సీనియర్ ఐఎఎస్ అధికారులను నియమించిందని వివరించారు.

పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు సేవ చేసే అవకాశం లభించటం ఎంతో సంతోషంగా ఉందని, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్ధ ఇప్పటికే మంచి ఫలితాలను సాధిస్తుందని, మరింత పారదర్శకంగా పని చేసి ప్రజలకు వేగవంతమైన సేవలు అందేలా కృషి చేస్తానని వివరించారు. జిల్లాను అభివృద్దిలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరి సహకారాన్ని అశిస్తున్నానని వివరించారు.

హిమాన్హు శుక్లాకు జిల్లా పరిషత్త సిఇఓ శ్రీనివాసులు, డిఆర్ఓ శ్రీనివాస మూర్తి, స్వాగతం పలకగా, కలక్టరేట్ ఎఓ మధుసూధనరావు తదితరులు పాల్గొన్నారు. తొలుత హిమాన్హు శుక్లా జిల్లా కలెక్టర్ ముత్యాల రాజును మర్యాద పూర్వకంగా కలిశారు. కలెక్టర్ జిల్లా రూపురేఖలు, సామాజిక పరిస్ధితుల గురించి శుక్లాకు వివరించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, జిల్లాలో కరోనా పరిస్దితులు, వార్డు, గ్రామ సచివాలయాల స్ధితి గతులలపై వీరిరువురు చర్చించారు. పేద ప్రజలకు ప్రభుత్వ పధకాలు సమర్ధవంతంగా చేరేలా కార్యాచరణ రూపొందించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.  ఈ కార్యక్రమంలో ఏలూరు ఆర్ డిఓ పనబాక రచన తదితర అధికారులు పాల్గొన్నారు.
eluru
Andhra Pradesh
himanshu shukla
West Godavari District

More Press News