కుటుంబ స‌భ్యుల‌తో క్యార‌మ్స్ ఆడిన తెలంగాణ మంత్రి ఎర్ర‌బెల్లి

Related image

  • లాక్ డౌన్ వెసులుబాటుని దుర్వినియోగం చేయొద్దు
  • కరోనా క‌ట్ట‌డి అవుతున్న ద‌శ‌లో విస్తర‌ణ‌కు మ‌నం కార‌ణం కావొద్దు
  • పూర్తిగా క‌రోనా క‌ట్ట‌డికి మ‌రికొంత స‌మ‌యం ప‌ట్టొచ్చు
  • అప్ప‌టి దాకా ప్ర‌జ‌లు లాక్ డౌన్ ని, స్వీయ నియంత్ర‌ణ‌ని పాటించాలి
  • సిఎం కెసిఆర్ చెప్పిన‌ట్లుగా న‌డుచుకుంటేనే మంచిది
  • హైద‌రాబాద్ లో కుటుంబ స‌భ్యుల‌తో క్యార‌మ్స్ ఆడిన మంత్రి ఎర్ర‌బెల్లి
హైద‌రాబాద్, మే 7: లాక్ డౌన్ వెసులు బాటుని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయ‌వ‌ద్ద‌ని తెలంగాణ రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. లాక్ డౌన్ నేప‌థ్యంలో గురువారం హైద‌రాబాద్ లోని త‌న ఇంట్లో కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి మంత్రి ఉత్సాహంగా, ఉల్లాసంగా క్యార‌మ్స్ ఆడారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి మాట్లాడుతూ, ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు కావొద్ద‌నే ఉద్దేశ్యంతోనే సీఎం కెసిఆర్ గ్రీన్, ఆరెంజ్ జోన్లు ఉన్న ప్రాంతాల్లో ప్ర‌ధానంగా గ్రామీణ ప్రాంతాల్లో వెసులు బాటు ఇచ్చార‌న్నారు. అయితే, అందివ‌చ్చిన స్వేచ్ఛ‌ని య‌ధేచ్ఛ‌గా వాడుకోవ‌ద్ద‌న్నారు. దుర్వినియోగం చేస్తే తిరిగి ఆయా చోట్ల మ‌ళ్ళీ లాక్ డౌన్ విధించే ప‌రిస్థితులు వ‌స్తాయ‌న్నారు.

క‌రోనా క‌ట్ట‌డికి మ‌రికొంత స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని, ఈ లోగా మ‌న‌కు మ‌నం క‌రోనా వైర‌స్ విస్తృతికి కార‌ణం కారాద‌ని మంత్రి ప్ర‌జ‌ల‌కు హిత‌వు ప‌లికారు. ప్ర‌జలు స్వీయ నియంత్ర‌ణ‌ని పాటించాల‌ని, కుటుంబ స‌భ్యుల‌తో హాయిగా గ‌డ‌పాల‌ని సూచించారు. రెడ్ జోన్ల ప్ర‌జ‌లు పూర్తి లాక్ డౌన్ పాటిస్తూ, అధికారులు, పోలీసుల‌కు స‌హ‌క‌రించాల‌న్నారు. సిఎం కెసిఆర్ తీసుకున్న చ‌ర్య‌ల కార‌ణంగానే తెలంగాణ ప్ర‌జ‌లు త‌క్కువ క‌రోనా ఎఫెక్ట్ తో, ఎక్కువ స్వేచ్ఛ‌గా ఉండ‌గలుగుతున్నార‌ని, త్వ‌ర‌లోనే మ‌న రాష్ట్రం క‌రోనా ఫ్రీ రాష్ట్రంగా మారుతుంద‌న్న ఆశాభావాన్ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు వ్య‌క్తం చేశారు.

ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేస్తున్న క‌రోనా నిర్మూల‌న‌కు సీఎం కెసిఆర్ చేస్తున్న కృషికి చేదోడు వాదోడుగ ఉండ‌డానికి వీలుగా తెలంగాణ ల‌క్క‌మారి కాపు సంక్షేమ సంఘం నిర్ణ‌యించింది. సిఎం స‌హాయ నిధికి రూ.3,45,197 విరాళం ప్ర‌క‌టించింది. ఈ మొత్తాన్నిమంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుకి ఈ రోజు హైద‌రాబాద్ లో అంద‌చేసింది. ఈ కార్య‌క్ర‌మంలో ల‌క్క‌మారి కాపు సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు గోనె శ్రీ‌నివాస్, కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు, పాల‌కుర్తి ఎంపీపీ న‌ల్ల నాగిరెడ్డి, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అనుముల న‌ర్స‌య్య‌, గౌర‌వాధ్య‌క్షుడు మంద రాజ‌మ‌ల్లు, పాల‌కుర్తి మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ ముస్కు రాంబాబు, క‌డుదుల క‌రుణాక‌ర్ రెడ్డి, ఆ సంఘం యువ‌జ‌న విభాగం, ఇత‌ర విభాగాల ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

                 
గ్రామీణ పేద‌రిక నిర్మూల‌న సంస్థ (సొసైటీ ఫ‌ర్ ఎలిమినేష‌న్ ఆఫ్ రూర‌ల్ పావ‌ర్టీ-సెర్ప్) ఆధ్వ‌ర్యంలో ఈ సీజ‌న్ మామిడిపండ్ల క్ర‌య‌విక్ర‌యాల్లోకి దిగింది. క‌రోనా స‌మ‌యంలో ఇప్ప‌టికే మాస్కుల త‌యారీలో కీల‌కంగా ప‌ని చేసిన మ‌హిళా సంఘాల ద్వారా మామిడి ఉత్ప‌త్తిదారుల సంఘాల‌ను ఏర్పాటు చేసింది. అలాగే ఐకెపి ఆధ్వ‌ర్యంలో ధాన్యం కొనుగోలు త‌ర‌హాలో మామిడి పండ్ల‌ను నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసి, వాటిని శాస్త్రీయ ప‌ద్ధ‌తిలో పండ‌బెట్టి అమ్ముతున్న‌ది.

ఈ వ్యాపారంలో 3వేల మెట్రిక్ ట‌న్నులు క్ర‌య‌విక్ర‌యాల ల‌క్ష్యం కాగా, ఇప్ప‌టికే 25 మెట్రిక్ ట‌న్నుల‌ను సెర్ప్ కొనుగోలు చేసింది. కాగా, ఈ క్ర‌య విక్ర‌యాల‌కు సంబంధించిన వివ‌రాల‌ను, న‌మూనాల‌ను మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుకి సెర్ప్ వ్య‌వ‌సాయ విభాగాన్ని చూస్తున్న డైరెక్ట‌ర్ ర‌జిత గురువారం హైద‌రాబాద్ లో అందించారు. మామిడి పండ్ల‌కు సంబంధించిన క్ర‌య‌విక్ర‌యాల వివ‌రాల‌ను, మార్కెటింగ్ ప‌ద్ధ‌తుల‌ను మంత్రికి వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి సెర్ప్ చేస్తున్న కృషిని అభినందించారు.

పాల‌కుర్తి, మే 7: ర‌క్త‌దానం మ‌హాదాన‌మ‌ని, ఆప‌ద‌లో ఉన్న వాళ్ళ‌కు ర‌క్తం ఇవ్వ‌డం ద్వారా వారి ప్రాణాలు కాపాడ‌వ‌చ్చ‌ని, ర‌క్త‌దాన శిబిరాలు విరివిగా చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. స్టేష‌న్ ఘ‌న్ పూర్ లో ఎమ్మెల్యే డాక్ట‌ర్ తాటికొండ రాజ‌య్య ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన ర‌క్త‌దాన శిబిరాన్ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ, క‌రోనా క‌ష్ట‌కాలంలో లాక్ డౌన్ కార‌ణంగా, స‌మాజంలో ప్ర‌శాంత‌త నెల‌కొంద‌న్నారు. అయిన‌ప్ప‌టికీ కొన్ని ర‌కాల దీర్ఘ‌కాలిక వ్యాధులు ఉన్న వాళ్ళ‌కి ర‌క్తం అవ‌స‌రం ఉంటుంద‌న్నారు. అలాంటి వాళ్ళంద‌రికీ క‌ర్తం ఇవ్వ‌డం ద్వారా వాళ్ళ ప్రాణాలు నిల‌ప‌వ‌చ్చ‌న్నారు. అందుకే ర‌క్త‌దాన శిబిరాలు విరివిగా నిర్వ‌హించి, ర‌క్త‌దానాన్ని ప్రోత్స‌హించాల‌ని మంత్రి తెలిపారు. అలాగే ర‌క్త‌దానం చేస్తే ర‌క్త‌దానం చేసిన వారి ఆరోగ్యం క్షీణిస్తున‌డంలో వాస్త‌వం లేద‌ని, మూడు నెల‌ల విరామంతో వంద‌కు పైగా సార్లు ర‌క్తం దానం చేసిన వాళ్ళు సైతం ఆరోగ్యంగా ఉన్నార‌ని మంత్రి వివ‌రించారు.

త్వ‌ర‌లో ఉప్పుగ‌ల్లు రిజ‌ర్వాయ‌ర్ ప‌నులు ప్రారంభం:

ఇదిలావుండ‌గా త్వ‌ర‌లోనే ఉప్పుగ‌ల్లు రిజ‌ర్వాయ‌ర్ ప‌నులు ప్రారంభ‌మ‌వుతాయ‌ని మంత్రి ఎర్ర‌బెల్లి చెప్పారు. సిఎం కెసిఆర్ ఆ విష‌య‌మై ఈ రోజు స‌మీక్షించార‌న్నారు. అనివార్య సాంకేతిక కార‌ణాల వ‌ల్ల ఆల‌స్య‌మైన ఉప్పుగ‌ల్లు రిజ‌ర్వాయ‌ర్ కి త్వ‌ర‌లోనే ఈ టెండ‌ర్లు పిలిచి వేగంగా ప‌నులు ప్రారంభించాల‌ని సిఎం ఆలోచిస్తున్నార‌న్నారు. అలాగే దేవాదుల ప్రాజెక్టు నీటి విష‌య‌మై కూడా సిఎం చ‌ర్చించార‌ని మంత్రి వివ‌రించారు.

More Press Releases