నిర్మల్ జిల్లాలో అటవీ శాఖ కార్యాలయంపై దాడికి సంబంధించిన పూర్తి వివరాలు!

Related image

నిర్మల్ జిల్లా కడెం మం. ఉడుంపూర్ ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంపై గండిగోపాల్ పూర్ గ్రామస్థుల దాడి చేశారు. అటవీశాఖ అధికారులు దాడి చేయడం వల్ల తమ గ్రామానికి చెందిన గాదె నర్సయ్య మృతి చెందినట్లు ఆరోపించారు. ఫారెస్ట్ కార్యాలయంలోని ఫర్నిచర్, ఫారెస్ట్ జీప్ ధ్వంసం చేశారు.

అయితే ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను అదిలాబాద్ అటవీ సర్కిల్ ఉన్నతాధికారులు వెల్లడించారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్  కోర్ ఏరియా పరిధిలో అడవికి నష్టం కలిగిస్తూ, చెట్లకు నిప్పు పెడుతుండగా నర్సయ్యను అటవీ అధికారులు ప్రత్యక్షంగా గమనించి అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా ఇలాగే చేసినప్పుడు హెచ్చరించి వదిలేసినా, మళ్లీ అదే తప్పు చేయటంతో ఈసారి (4.05.2020) అదుపులోకి తీసుకుని విచారించారు.

సంఘటన తెలుసుకున్న గ్రామస్థులు.. సర్పంచ్ భర్త కుర్రా లక్ష్మణ్, ఉప సర్పంచ్ దొంతుల శ్రవణ్ కుమార్ అటవీ అధికారులను కలిశారు. విచారణకు సహకరిస్తామని, ఎప్పుడు అవసరమైనా తీసుకువస్తామని పూచీకత్తు బాండ్ పై సంతకం చేసి, అదే రోజు తమతో తీసుకువెళ్లారు.

మరుసటిరోజు (5/05) నర్సయ్య ఉట్నూరు ప్రభుత్వ హాస్పటల్ లో చనిపోయాడని, ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం. విషయం తెలుసుకున్న గ్రామస్థులు, అతని మరణానికి అటవీ అధికారుల వేధింపులే కారణమంటూ ఉడుంపూర్ ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంపై దాడి చేసి, ఫర్మిచర్, జీపును ధ్వంసం చేశారు. అయితే నర్సయ్య చనిపోవడానికి, తమకు ఎలాంటి సంబంధం లేదని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు.

ఊరి నుంచి వచ్చిన పెద్దలే సొంత పూచీకత్తుపై ఆరోగ్యంగా ఉన్న నర్సయ్యను తమతో ముందు రోజు తీసుకువెళ్లారని అధికారులు స్పష్టం చేశారు. ఏ ఒక్క అటవీ అధికారి, సిబ్బంది కూడా అతనిపై చేయి చేసుకోలేదని తెలిపారు. వాస్తవాలు ఇలా ఉండగా, అటవీ కార్యాలయంపై గ్రామస్థులు దాడి చేయటం చట్ట విరుద్దమని, అన్ని వివరాలను జిల్లా ఎస్పీకి వివరించామని, పూర్తి నివేదికను ఇచ్చామని నిర్మల్ జిల్లా అటవీ అధికారులు తెలిపారు. 

More Press Releases