పిటిషన్ తయారీపై అధికారులతో తెలంగాణ మంత్రి సత్యవతి సమీక్ష

Related image

  • సుప్రీం కోర్టు ఆధారాల పరిశీలన
  • పిటిషన్ వేయడానికి నివేదికపై కసరత్తు
  • న్యాయ సలహాలపై సమీక్ష చేసిన తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
హైదరాబాద్, మే 05 : గిరిజన హక్కులను కాపాడే జీవో ఎం.ఎస్ 3పై సుప్రీం కోర్టులో రాష్ట్రం తరపున అడ్వకేట్ ఆన్ రికార్డ్స్ సమర్పించిన ఆధారాలను తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ నేడు పరిశీలించారు. షెడ్యూల్ ఏరియాలోని టీచర్ పోస్టులను వంద శాతం గిరిజనులతోనే భర్తీ చేయాలని జారీ చేసిన జీవో ఎం.ఎస్ 3ని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం కొట్టివేయడంపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ముఖ్యమంత్రి కేసిఆర్ నిర్ణయించడంతో పిటిషన్ తయారీపై మంత్రి సత్యవతి రాథోడ్ నేడు దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తు, అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి, సంయుక్త సంచాలకులు కళ్యాణ్, తదితర అధికారులతో సమీక్ష చేశారు.

రాష్ట్రంలోని గిరిజనులు హక్కులను కాపాడేందుకు సమగ్రమైన పిటిషన్ దాఖలు చేయాలని, దీని కోసం న్యాయ నిపుణుల సలహాలు, సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదుల సలహాలు స్వీకరించాలని, ఇందుకోసం కావల్సిన నివేదికలు, సమాచారాన్ని సిద్ధం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.

త్వరలోనే గిరిజన ప్రజా ప్రతినిధులు, నిపుణుల సలహాలు తీసుకునేందుకు సమావేశం ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం సుప్రీం కోర్టులో ఇచ్చిన తీర్పులోని అంశాలను, మనం పిటిషన్ వేయడానికి బలమైన కారణాలతో సమగ్ర నివేదిక రూపొందించాలన్నారు.

More Press Releases