నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన హోంమంత్రి

నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన హోంమంత్రి
హైదరాబాద్ నగరంలోని గోషామహాల్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న పేదవారికి రాష్ట్ర హోంమంత్రి శ్రీ మహమ్మద్ మహమూద్ అలీ నిత్యావసర సరుకులు శుక్రవారం నాడు పంపిణీ చేశారు. పేదవారికి బియ్యం,గోధుమలు,పప్పు, ఉల్లిగడ్డలు వంటి నిత్యావసర సరకులతో కూడిన ప్యాకెట్లను పంపిణీ చేసేందుకు స్థానిక కార్పొరేటర్ ముకేశ్ సింగ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హోంమంత్రి పాల్గొన్నారు .

దాదాపు 500 మందికి ఈ పాకెట్లను పంపిణీ చేయడం ద్వారా కార్పొరేటర్ తన వంతు గా సహాయపడుతున్నారని,అదేవిదంగా డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం పూర్తి చేయడంలో తన వంతు కృషి చేశాడన్నారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తం గా లాక్ డౌన్ మొదటి రోజు నుండే తెల్ల రేషన్ కార్డులు ఉన్న రాష్ట్రంలోని 87 లక్షల పై చిలుకు పేదలకు.... అంతే కాకుండా రేషన్ కార్డులు లేని పేదలకు కూడా నిత్యావసర వస్తువుల ను అందిస్తోందని తెలియజేశారు. ముఖ్యమంత్రిగా కె సి ఆర్ నాయకత్వలో సహాయ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయన్నారు. మనవంతు ప్రయత్నాంగా ఎవరూ అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచించారు. బయటకు అర్జెంట్ పని పై వచ్చినప్పుడు, దూరం పాటించాలన్నారు.
Corona Virus
Mohammed Mahmood Ali
Telangana

More Press News