పేద ముస్లిం మైనారిటీలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేసిన మంత్రి హరీశ్ రావు

Related image

  • పేద ముస్లిం మైనారిటీలకు రంజాన్ తోఫా
  • ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పంపిణీ చేసిన మంత్రి హరీశ్ రావు
సిద్ధిపేట : జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ముర్షద్ గడ్డలో గురువారం ఉదయం రంజాన్ పండుగ సందర్భంగా ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద ముస్లిం మైనారిటీలకు నిత్యావసర వస్తువుల కిట్స్, ప్రతి ఒక్కరికీ రూ.500 రూపాయల నగదును మంత్రి చేతుల మీదుగా అందజేశారు.

మంత్రి హరీశ్ రావు కామెంట్స్:
  • కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో పని లభించక దినసరి కూలీలు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ముఖ్యమంత్రి కేసీఆర్ రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి ప్రతి ఒక్కరికీ 12 కిలోల బియ్యం, 1500 రూపాయల నగదు అందించి ఏప్రిల్ నెల ఆదుకున్నాం. అదే విధంగా వచ్చే మే నెలలో కూడా ఆదుకుంటాం
  • సర్వ మానవాళి క్షేమం కోసం ప్రార్థనలు చేయండి
  • రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని ఉపవాసం ఉన్న మీరు రాష్ట్ర, దేశ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని అల్లాను ప్రార్థించండి
  • రంజాన్ పండుగ సందర్భంగా ఇంట్లోనే నమాజ్ చేయండి. ప్రభుత్వానికి సహకరించండి
  • సిద్ధిపేటలోని అర్హులైన ముస్లింలందరికీ అందేలా ఏర్పాట్లు చేయిస్తానని మంత్రి భరోసా
  • ప్రభుత్వ ఆదాయం తగ్గినా., కరోనా నేపథ్యంలో విపత్కర పరిస్థితి వచ్చినా పేదలను ఆదుకునేందుకు సంక్షేమానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం ముందున్నది
  • కరోనా అందరి సమస్య మనమంతా ఐక్యంగా కలిసి కరోనా పై పోరాడదాం
  • సిద్ధిపేట కరోనా ఫ్రీ జిల్లా అయ్యిందని, బయటకు రావొద్దు. ప్రజలంతా ప్రభుత్వానికి లాక్ డౌన్ కు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు
  • కరోనా మనిషిలో ప్రవేశించేది గొంతులోకి, ఆ తర్వాత అవయవాలపై ఆ వైరస్ దాడి చేస్తుంది. ఇందు కోసం ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుచి, శుభ్రత అలవాటు చేసుకుని వేడి నీరు తాగండి
  • జలుబు చేస్తే ఆవిరి పట్టినట్లు, పసుపు వేసి ఆవిరి పట్టండి
  • శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచే ఆహారాన్ని తీసుకోండి
  • మాకేం అవుతుంది. ఏం కాదులే అనే నిర్లక్ష్యం వద్దు
  • అనవసరంగా బయట తిరగొద్దు. తిరిగి ఇంటి వాళ్లకు కరోనాను అంటించొద్దు
  • కరోనా వైరస్ కట్టడి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విశేషమైన కృషి చేస్తున్నది

సిద్ధిపేట జిల్లా నంగునూరు మండల వెంకటాపూర్ లో మామిడి కాయల సేకరణ కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు

More Press Releases