జీహెచ్ఎంసీ ప్రదాన కార్యాలయమును సందర్శించిన కేంద్ర అంతర్ మంత్రిత్వ శాఖల అధికారుల బృందం

Related image

హైద‌రాబాద్‌, ఏప్రిల్ 28: జలశక్తి శాఖ అదనపు కార్యదర్శి అరుణ్ భరొక నేతృత్వంలోని కేంద్ర అంతర్ మంత్రిత్వ శాఖల అధికారుల బృందం మంగళవారం జీహెచ్ఎంసీ ప్రదాన కార్యాలయమును సందర్శించింది. ముందుగా కోవిద్-19 కంట్రోల్ రూం పని తీరును తనిఖీ చేసింది. కంట్రోల్ రూమ్ నిర్వహిస్తున్న విధులు గురించి ఓ ఎస్ డి అనురాధ వివరించారు. దీనిపై కేంద్ర బృందం పలు అంశాలపై ప్రశ్నించి, అప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న అధికారులకు రాండమ్ ఫోన్ చేయించి ద్రువీకరించుకున్నారు. వలస కార్మికులకు కల్పిస్తున్న సదుపాయాలు గురించి, వారి నుండి కంట్రోల్ రూమ్ కు వస్తున్న కాల్స్ గురించి, అన్నపూర్ణ మొబైల్ కేంద్రాల ద్వారా ఏ విదంగా టై అప్ చేసి రెగ్యులర్ గా భోజనం పెడుతున్నారు, ఏ ఏ శాఖలు, జిల్లాలతో సమన్వయము చేసుకుంటున్నారనే వివరాలు తెలుసుకున్నారు.

కరోనా నేపథ్యంలో ఆహారం పంపిణీ చేసిన వారి వివరాలు, ఎంత మందికి ఆహారం అందింది అనే వివరాలు తెలుసుకున్నారు. మూడు షిఫ్టులలో 24/7 పని చేస్తున్నట్లు అధికారులు వివరించారు. అత్యవసర సేవలు అందించుటకు 32 అంబులెన్సులను జోనల్ కమీషనర్ కార్యాలయాలలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. విదేశాల నుండి వచ్చి ఇక్కడ హోటల్స్ లో ఉంటున్న వారిని పర్యాటక అధికారి మానిటరింగ్ చేస్తున్నట్లు తెలిపారు. హెల్ప్ లైన్ నెంబర్ 040-2111 11 11 కు వచ్చిన ప్రతి కాల్ ను రిజిస్టర్ లో నమోదు చేసి స్పందిస్తున్నట్లు తెలిపారు. హెల్ప్ లైన్ కు ఏడు లైన్స్ ఉన్నట్లు తెలిపారు. అనుమానిత కేసులపై తదుపరి చర్యల నిమిత్తం సర్కిల్ కార్యాలయాలకు పంపుతున్నట్లు తెలిపారు.

విదేశాల నుండి వచ్చిన వారు, హోం క్వారంటైన్ లో ఉంచిన వారి ఆరోగ్య స్థితిపై ఫీడ్ బ్యాక్ సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా కరోనా నేపథ్యంలో మంత్రులు, జీహెచ్ఎంసీ చేపట్టిన కార్యక్రమాల వీడియోలను కేంద్ర కమిటి చూసింది. పారిశుద్య, ఎంటమాలజీ, డీఆర్ఎఫ్ వారి సేవలను అభినందిస్తు మంత్రి కేటిఆర్ వారితో భోజనం చేసిన వీడియోలను చూసి అభినందించారు.

అనంతరం కమిటీ సభ్యులు జీహెచ్ఎంసీ కమాండ్ కంట్రోల్ రూమ్ ను సందర్శించి, ఆన్ లైన్ మానిటరింగ్ సిస్టంను పరిశీలించారు. కేసుల మానిటరింగ్ గురించి కమిటీకి కమీషనర్ డిఎస్ లోకేష్ కుమార్ వివరించారు.

ఈ బృందంలో కేంద్ర ప్ర‌జారోగ్య‌శాఖ సీనియ‌ర్ వైద్యులు డా.చంద్ర‌శేఖ‌ర్ గెడం, జాతీయ పోష‌కాహ‌ర సంస్థ డైరెక్ట‌ర్ డా.హేమ‌ల‌త‌, వినియోగ‌దారుల వ్య‌వ‌హారాల శాఖ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.ఠాకూర్‌, జాతీయ విప‌త్తు నివార‌ణ సంస్థ అసోసియేట్ ప్రొఫెస‌ర్ శేఖ‌ర్ చ‌తుర్వేదిలు ఉన్నారు.

More Press Releases