పేటీఎం మాల్ ద్వారా భారతదేశంలో విస్తరించిన ఈబే

Related image

  • పేటిఎం మాల్ ద్వారా భారతదేశంలో తన ఉనికిని విస్తరించిన ఈబే
  • ఈబే గ్లోబల్ ఇన్వెంటరీ ఇక పేటిఎం మాల్ పై అందుబాటులో ఉంటుంది
  • ఈబే, పేటిఎం మాల్ లో పెట్టుబడి పెడుతోంది, సుమారుగా 5.5% షేర్స్ ను స్వంతం చేసుకుంది
ఈబే ఇంక్. (న్యాస్‌డాక్: ఈబే), ఒక ప్రముఖ ప్రపంచ వాణిజ్య సంస్థ మరియు పేటిఎం మాల్, భారతదేశంలోని ఒక ఈ-మార్కెట్ ప్లేస్, ఈ రెండూ కలిసికట్టుగా, భారతదేశంలోని పదుల మిలియన్ల కొలదీ గల పేటిఎం మాల్ చురుకైన వినియోగదారులకు ఈబే ఇన్వెంటరీని అందుబాటులోనికి తీసుకువస్తున్నట్టు ప్రకటించాయి. అదనంగా, ఈబే వారు, పేటిఎం మాల్ లో పెట్టుబడి పెట్టనున్నారు మరియు సుమారుగా 5.5% వంతు వాటాను స్వంతం చేసుకోబోతున్నారు.

“మేము భారతదేశం పట్ల ఎక్కువ నిబద్ధతతో ఉన్నాము మరియు ఈ క్రియాశీలక మార్కెట్ లో అతిపెద్ద అభివృద్ధి సామర్థ్యం మరియు గణనీయమైన అవకాశాలు ఉన్నాయని విశ్వసిస్తున్నాము," అని జూమాన్ పార్క్, ఈబే సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఎపిఎసి, అన్నారు. "ఈ కొత్త అనుబంధం, వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ లో, మా క్రాస్ బార్డర్ ట్రేడ్ కృషిని వేగవంతం చేస్తుంది. దీనితో వందల మిలియన్ల పేటిఎం మరియు పేటిఎం మాల్ వినియోగదారులకు, ఈబే వారి అసమానమైన వస్తువుల ఎంపికలకు వీలుకల్పిస్తుంది."

పేటిఎం మాల్, పేటిఎం ఎకో సిస్టమ్ లోని వినియోగదారుల కోసం అంతర్జాతీయ కొనుగోళ్ళను సులభతం చేస్తుంది. టెక్నాలజీ మరియు వ్యూహాత్మక భాగస్వామ్యాల ద్వారా, పేటిఎం మాల్, క్రాస్ బార్డర్ ట్రేడ్ లోని సవాళ్ళను అధిగమించగలుగుతోంది వీటిలో అధిక పంపిణీ ఖర్చులు, రిటర్న్స్ మరియు దీర్ఘకాలిక గడువు మొదలైనవి ఉన్నాయి, దీనితో పాటుగా, కస్టమ్స్ డ్యూటీస్ తో సహా నియంత్రణా ఆవశ్యకతలు పూరించాల్సి ఉంటుంది.

“నేటి భారతీయ వినియోగదారులు, తమ పరిధిని విస్తరించుకున్నారు మరియు ఇప్పుడు అది అంతర్జాతీయ వేదికల నుండి విశిష్ట ఉత్పాదనల కోసం షాపింగ్ వంటిదిగా ఉంది," అని రుద్ర దాల్మియా, ఎక్జెక్యుటివ్ డైరెక్టర్, పేటిఎం మాల్, అన్నారు. "ఈ కొత్త వ్యూహాత్మక సమన్వయం, భారతీయ వినియోగదారులకు, ఈబే యొక్క విస్తృత ఎంపికలతో ఇన్వెంటరీకి వీలుకల్పిస్తోంది. మా క్రాస్ బార్డర్ పార్ట్ నర్ మరియు ఇన్వెస్టర్ గా, ఈబే తో ఈ అనుబంధం గురించి మేము ఎంతో ఉత్తేజితులయ్యాము మరియు కలిసికట్టుగా, మేము కొనుగోలుదారులకు మరియు విక్రయదారులకు, మా వేదికపై కనుగొనడానికి పనిచేయడానికి మరియు లావాదేవీలు జరపడానికి, ఒక అసమాంతర అవకాశం కల్పించగలమని విశ్వసిస్తున్నాము."

రెండు కంపెనీల మధ్య ఈ కొత్త సంబంధం, ఈ వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ లోని కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి, ఈబే విక్రయదారులకు అవకాశం ఉంటుంది మరియు స్థానికంగా చేరుటకు పేటిఎం మాల్ కొనుగోలుదారులకు ఒక విస్తృత గ్లోబల్ ఇన్వెంటరీ ఎంపికను అందించవచ్చు. రాబోవు వారాలలో, ప్రపంచవ్యాప్తంగా ఈబే విక్రయదారుల నుండి మిలియన్ల కొద్దీ ఉత్పత్తులను పొంది, వాటిని పేటిఎం ఎకో సిస్టమ్ లోపల పేటిఎం మాల్ షాపింగ్ అనుభవం పొందుటకు వీలుకల్పించబడుతుంది.

జనవరి తొలినాళ్ళలో ఈబే ప్రారంభించిన కొన్ని నెలలలోనే, ఈబే, భారతదేశంలోని చిన్న మరియు మధ్యస్థ వ్యాపారాలు, తమ ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా ఈబే యొక్క 182 మిలియన్ వినియోగదారులకు వీలుకల్పించులాగా చేసింది.

“మేము పేటిఎం మాల్ తో మా కొత్త అనుభంధం గురించి ఉత్సాహంగా ఉన్నాము. ఇది భారతదేశంలో పెట్టుబడి పెట్టాలనే మా నిబద్ధతకు మరింత బలం చేకూరుస్తుంది మరియు మా ప్రస్తుత ఎగుమతి, దిగుమతి మరియు దేశీయ వేదికలకు అనుబంధంగా నిలుసుతుంది," అని పార్క్ గారు అన్నారు.

పేటిఎం మాల్ అనేది భారతదేశంలోని అతిపెద్ద డిజిటల్ ఎకోసిస్టమ్ యొక్క భాగము, ఇందులో 450 మిలియన్ల కంటే ఎక్కువమంది రిజిస్టర్డ్ వినియోగదారులు, 130 మిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్స్, మరియు 12 మిలియన్ కంటే ఎక్కువ రిజిస్టర్డ్ వ్యాపారులు ఉన్నారు.

“పేటిఎం మాల్ ఎల్లపుడూ కూడా క్రాస్-బార్డర్ అవకాశం అనేది ట్యాప్ చేయబడని ఒక అతిపెద్ద విభాగం మరియు లాజికల్ అభివృద్ధి పథంగా ఉందని విశ్వసిస్తోంది ఎందుకంటే సాంకేతిక అనేది ప్రపంచాన్ని చిన్నదిగా చేసేసిమ్ది," అని శ్రీనివాస్ మోథే, సిఎంఓ పేటిఎం మాల్, అన్నారు.

ఫార్వర్డ్-లుకింగ్ స్టేట్మెంట్స్:

ఈ పత్రికా విడుదలలో, ఇతర అంశాలతో పాటుగా, ఈబే ఇంక్ మరియు దాని సమన్వయ అనుబంధ సంస్థల యొక్క భవిష్య పనితీరుకు సంబంధించిన ఫార్వర్డ్-లుకింగ్ స్టేట్మెట్ట్స్ ఉంటాయి. ఈ స్టేట్మెంట్స్, ఈబే యొక్క ప్రస్తుత అంచనాలు, భవిష్య అంచనాలు మరియు ఇందులోని అపాయాలు, మరియు సంబద్ధతలపై ఆధారపడి ఉంటాయి. వాస్తవ ఫలితాలు, అనేక కారణాల కారణంగా, ఈ పత్రికా విడుదలలో ఊహించబడిన లేదా సూచించబడినవాటికి భిన్నంగా ఉండవచ్చు. మీరు, మన కార్యనిర్వాహకంపై ప్రభావం చూపగల, అపాయాలు, అసంబద్ధతలు మరియు ఇతర కారణాల గురించి మరింత సమాచారాన్ని, మా ఇటీవలి వార్షిక నివేదిక ఫారం 10-కె పై మరియు తదుపరి త్రైమాసిక నివేదికలు ఫారం 10-క్యు ద్వారా తెలుసుకోవచ్చు, వీటి కాపీలు కూడా మీరు ఈబే ఇన్వెటర్ రిలేషన్స్ వెబ్ సైట్ https://investors.ebayinc.com ను సందర్శించి లేదా ఎస్‌ఇసి వెబ్‌సైట్ www.sec.gov సందర్శించి తెలుసుకోవచ్చు. మీరు ఇక ఎలాంటి ఫార్వర్డ్-లుకింగ్ స్టేట్మెంట్స్ పై ఆధారపడాల్సిన పనిలేదు. ఈ పత్రికావిడుదల లోని సమాచారమంతా జూలై 18, 2019 నాటిది మరియు మేము ఈ సమాచారాన్ని అప్డేట్ చేయు విధిని నిర్వర్తించడంలేదు.

ఈబే గురించి:
ఈబే ఇంక్. (నాస్‌డాక్:ఈబే) అనేది మార్కెట్ ప్లేస్, స్టబ్ హబ్ మరియు వర్గీకరించబడిన వేదికలతో సహా ఒక ప్రపంచవ్యాప్త ప్రముఖ వాణిజ్య సంస్థ. సంఘటింగా, మనం ప్రపంచవ్యాప్తంగా, మిలియన్ల కొలదీ కొనుగోలుదారులను మరియు విక్రయదారులను కలుపుతూ, ప్రజలందరికీ సాధికారతను మరియు అవకాశాలను ఏర్పాటు చేస్తాము. 1995 లో సాన్ జోస్, కలిఫ్ లో స్థాపించబడిన ఈబే, ఒక గొప్ప విలువను మరియు విశిష్ట ఎంపికను కనుగొనడంలో, ప్రపంచంలోనే అతి పెద్ద మరియు అత్యంత వైబ్రంట్ మార్కెట్ ప్లేస్ గా అవతరించింది. 2018 లో, ఈబే, 95 బిలియన్ డాలర్ల స్థూల వాణిజ్య పరిమాణాన్ని సాధించింది. కంపెనీ గురించిన మరింత సమాచారం మరియు ఆన్ లైన్ బ్రాండ్స్ యొక్క ప్రపంచవ్యాప్త పోర్ట్ ఫోలియో కోసం, సందర్శించండి: www.ebayinc.com.

పేటిఎం మాల్ గురించి:
పేటిఎం మాల్, భారతదేశంలోని అతి పెద్ద ఇ-కామర్స్ గమ్యాలలో ఒకటి. ఇది భారతదేశంలోని ఆన్ లైన్ నుండి ఆఫ్ లైన్ వణిజ్యం యొక్క ప్రముఖ సంస్థ మరియు భారతదేశంలోని అతిపెద్ద డిజిటల్ ఎకో సిస్టమ్ - పేటిఎం ఎకోసిస్టమ్ లో ఒక భాగస్వామి. పేటిఎం మాల్, 2018 లో 2.1 బిలియన్ డాలర్ల స్థూల వాణిజ్య విలువ పొందింది. పేటిఎం మాల్ 2017 లో స్థాపించబడింది మరియు దీనికి సాప్ట్ బ్యాంక్, ఆలిబాబా, ఎస్‌ఎఐఎఫ్ మరియు యాంట్ ఫైనాన్షిల్ వంటి పెట్టుబడిదారుల సహకారం ఉంది. పేటిఎంమాల్, పేటిఎం ఇ-కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నిర్వహించబడుతోంది.

More Press Releases