‘లోకల్ షాప్స్ ఆన్ అమెజాన్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన అమెజాన్

Related image

  1. భారతదేశవ్యాప్తంగా 5000కు పైగా లోకల్ షాప్స్, రిటైలర్స్ ఇప్పటికే ఈ కార్యక్రమం కింద నమోదు; వారిలో వందలాది మంది ఈ సవాళ్ళ సమయంలో వినియోగదారులకు అవసరమైన ఉత్పాదనలను విక్రయిస్తున్నారు
  2. ఒకసారి పరిస్థితి గనుక సాధారణ స్థితికి చేరుకుంటే వినియోగదారులు ఈ లోకల్ షాప్స్ నుంచి తమ ఇళ్లలోనే ఉంటూ షాప్ చేయగలుగుతారు మరియు విస్తృత ఎంపిక, వేగవంతమైన డెలివరీలు, అదే విధంగా అంతర్ నిర్మిత విలువ జోడించిన సేవల ప్రయోజనాలను పొందగలుగుతారు.
  3. ఈ కార్యక్రమ విస్తరణకు అమెజాన్ రూ.10 కోట్లను ఇన్వెస్ట్ చేయనుంది
 
ఇండియా, 25 ఏప్రిల్ 2020: అమెజాన్ నేడిక్కడ ‘లోకల్ షాప్స్ ఆన్ అమెజాన్’ కార్యక్రమం ఆవిష్కరణను ప్రకటించింది. అన్నిపరిణామాలకు చెందిన లోకల్ షాప్ కీపర్స్ మరియు రిటైలర్లకు ఈ కార్యక్రమం ఇ-కామర్స్ ప్రయోజనాలను అంది స్తుంది. డిజిటల్ ఉనికితో ఇది ప్రస్తుతం దుకాణాలకు వచ్చే వారికి అదనంగా ఉంటుంది. సాధారణ పరిధిని మించి విని యోగదారులను చేరుకునేందుకు తోడ్పడుతుంది. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా అన్ని పరిణామాలకు చెందిన లోకల్ షాప్ కీ పర్స్ మరియు రిటైలర్లకు భారతదేశవ్యాప్తంగా ఆన్ లైన్ లో విక్రయించేం దుకు అమెజాన్ తన సాంకేతికత, శిక్షణ మరి యు ఎనేబుల్ మెంట్ శక్తిసామర్థ్యాలను వినియోగిస్తుంది. ‘లోకల్ షాప్స్ ఆన్ అమెజాన్’ లో చేరే దుకాణదారులు నగరం లో వేగంగా డెలివరీ చేసేందుకు తమ ప్రస్తుత డెలివరీ సెటప్స్ ను ఉపయోగించుకోవచ్చు మరియు అమెజాన్ యొక్క ఫు ల్ ఫిల్ మెంట్ సర్వీసెస్ ను ఉపయోగించడం ద్వారా తాము సేవలందించే ప్రాంతాలను విస్తరించుకోవచ్చు. అదనంగా ఈ దుకాణాలు అమెజాన్ యొక్క ఇతర కార్యక్రమాల్లోనూ చేరవచ్చు. డెలివరీ మరియు పికప్ పాయింట్లు గా వ్యవహరించేం దుకు ‘ఐ హావ్ స్పేస్’, అదనపు ఆదాయం పొందేందుకు గాను తమ వాక్ – ఇన్ కస్టమర్లకు వారు తమ ఎంపికను విస్తృ తం చేసుకునేందుకు గాను ‘అమెజాన్ ఈజీ’ని ఆఫర్ చేయవచ్చు. భారతదేశవ్యాప్తంగా 5000కు పైగా లోకల్ షాప్స్ మరి యు రిటైలర్లు ఇప్పటికే ఈ ప్రోగ్రామ్ కింద తమ పేర్లు నమోదు చేసుకున్నారు మరియు వారిలో వందలాది మంది ఈ స వాళ్ళ సమయంలో వినియోగదారులకు అవసరమైన ఉత్పాదనలను విక్రయిస్తున్నారు.అటు ఆన్ లైన్ లో మరియు ఇ టు ఆఫ్ లైన్ షాపింగ్ అనుభూతులలో ఉండే అత్యుత్తమమైన వాటిని అందించే ఈ ప్రోగ్రామ్ వినియోగదారులు తమ కు చేరువలో ఉండే తమ అభిమాన లోకల్ షాప్స్ లో షాపింగ్ ను తమకు సౌకర్యవంతంగా ఉండేలా ఇంటి నుంచే చేసుకు నేందుకు వీలు కల్పించేలా రూపొందించబడింది. విస్తృత ఎంపిక, వేగవంతమైన డెలివరీల ప్రయోజనాన్ని ఇది అందిస్తుం ది. దాంతో పాటుగా డెమో మరియు ఇన్ స్టాలేషన్, పాత ఫోన్ నుంచి కొత్త ఫోన్ కు కాంటాక్ట్ ల బదిలీ లాంటి అంతర్ ని ర్మిత విలువ జోడించిన సేవల ప్రయోజనాలను పొందగలుగుతారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యం లో కొనుగోలుదారులు ఈ ప్రోగ్రామ్ కింద లోకల్ షాప్స్ మరియు రిటైలర్స్ నుంచి నిత్యావసరాల కోసం మాత్రమే షాపింగ్ చేయగలుగుతారు.

గత 6 నెలలుగా అమెజాన్ ఈ ప్రోగ్రామ్ కు సంబంధించి 5000+ లోకల్ షాప్స్ మరియు ఆఫ్ లైన్ రిటైలర్స్ తో ఒక పైలట్ ప్రోగ్రామ్ నిర్వహించింది. ప్రముఖ మెట్రోలతో పాటుగా బెంగళూరు, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, పుణె, జైపూర్, అహ్మదా బాద్, కోయంబత్తూరు, సూరత్, ఇండోర్, లఖ్ నవు, సహరాన్ పూర్, ఫరీదాబాద్, కోట, వారణాసి లాంటి ప్రథమ, ద్వితీ య శ్రేణి నగరాలకు చెందిన రిటైలర్లు వీరిలో ఉన్నారు. పైలట్ కింద ఎంపికైన షాప్స్ లో కిచెన్, హోమ్, ఫర్నీచర్, అపెరల్, ఆటోమోటివ్, బ్యూటీ, ఎలక్ట్రానిక్స్, స్పోర్ట్స్, గ్రాసరీ, లాన్ అండ్ గార్డెన్, బుక్స్, టాయ్స్, జ్యువెలరీ, లార్జ్ అప్లియెన్సెస్ లాంటి వివిధ ఉత్పాదన విభాగాలకు చెందినవి ఉన్నాయి.

ఈ ప్రోగ్రామ్ లో ఇప్పటికే భాగంగా ఉన్న లోకల్ షాప్స్ అండ్ రిటైలర్స్ లో ఢిల్లీ ఎలక్ట్రానిక్స్ ప్లాజా (కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఢిల్లీ), మై స్లీపీ హెడ్ (మ్యాట్రెసెస్, కృష్ణగిరి), గ్రీన్ సోల్ (ఫర్నీచర్, ముంబై), సంగీతా మొబైల్స్ (మొబైల్ ఫోన్స్, బెంగళూ రు), ఆర్య ఆర్గానిక్ ప్రోడక్ట్స్ (గ్రాసరీ కన్జ్యూమబుల్స్, బెంగళూరు), కంఫర్ట్ బెడ్డింగ్ (బెడ్డింగ్ అండ్ మ్యాట్రసెస్, ఢిల్లీ), షూ మిస్త్రీ (షూస్ కేర్, ఢిల్లీ), ఎలక్ట్రో కార్ట్ (ఢిల్లీ ఎన్సీఆర్), మధురం ఎలక్ట్రానిక్స్ (అహ్మదాబాద్), ది మ్యాట్రెస్ హబ్ (ఢిల్లీ ఎ న్సీఆర్), ఎలక్ట్రానిక్స్ షాపీ (ఢిల్లీ ఎన్సీఆర్), అదిత్ ఎలక్ట్రానిక్స్, రా ప్రెసెరీ (బీవరేజెస్, ముంబై), వెగురాంటీ (గ్రాసరీ అండ్ హెల్త్ కేర్, లఖ్ నవూ) లాంటివి ఉన్నాయి.

ఈ సందర్భంగా అమెజాన్ ఇండియా సెల్లర్ సర్వీసెస్ వీపీ గోపాల్ పిళ్లై మాట్లాడుతూ, ‘‘లోకల్ షాప్స్ ఆన్ అమెజాన్ అనే ది దేశంలో ఎక్కడ ఉండే ప్రతీ మోటివేటెడ్ విక్రేత కూడా భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులను చేరుకునేలా చేయడంపై మేము దృష్టి వహించిన దానికి అనుగుణంగానే ఉంది. తమ ప్రస్తుత వనరులు, ఆస్తులు ద్వారానే, చేరుకోదగి న అధిక కస్టమర్ బేస్ ద్వారా పొందే ప్రయోజనంతో ఇది అన్ని పరిణామాలకు చెందిన  లోకల్ షాప్స్, రిటైలర్స్ కు  సాధి కారికత అందిస్తుంది. అదే సమయంలో కొనుగోలుదారులు విలువ జోడించబడిన సేవలు, ఉత్పాదనల వేగవంతమైన డెలివరీలతో తమ నగరాల్లోని లోకల్ షాప్స్ ద్వారా కొనుగోలు చేసే సౌలభ్యాన్ని పొందగలుగుతారు’’ అని అన్నారు.

‘‘గత కొన్ని వారాలుగా మనం ఊహించని సవాళ్ళను ఎదుర్కొంటున్నాం. ఈ సమయంలో కొనుగోలుదారులకు ఏవి అత్య వసరమో వాటిని అందించే ప్రయత్నాలపై పై మాత్రమే మేము ప్రధానంగా దృష్టి వహించాం. లోకల్ షాప్స్ ప్రోగ్రామ్ నుంచి భారతదేశవ్యాప్తంగా వందలాది మంది రిటైలర్లు ప్రజలకు కావాల్సిన నిత్యావసరాలను అందిస్తూనే, భౌతిక దూరం పాటిం చడంలో ప్రజలకు సహాయం చేయడంలో కీలకపాత్ర పోషించడం అభినందించదగ్గ అంశం. పరిస్థితి మెరుగుపడుతున్న కొద్దీ భౌతిక దూరం పాటించడంలో వారు ప్రజలకు తమ సహాయాన్ని కొనసాగిస్తారు మరియు తమ జీవనోపాధులను ప్రారంభిస్తారు మరియు తమకోసం దీర్ఘకాలిక అవకాశాలను ఏర్పరుచుకోగలుగుతారు’’ అని అన్నారు.
లోకల్ షాప్స్ మరియు రిటైలర్స్ సాంకేతికతను అక్కున చేర్చుకునేందుకు మరియు తమకు తాముగా అవి డిజిటల్ లోకి మరియు హైబ్రిడ్ లోకి మార్చుకునేందుకు ఈ ప్రోగ్రామ్ తోడ్పడుతుంది. ఈ పైలట్ ప్రాజెక్ట్ విస్తరించేందుకు మరియు దీని కింద భారతదేశవ్యాప్తంగా రీటెయిలర్లకు, దుకాణదారులకు శిక్షణ ఇచ్చేందుకు అమెజాన్ ఇండియా రూ. 10 కోట్లు వె చ్చించనుంది.

‘లోకల్ షాప్స్ ఆన్ అమెజాన్’ ప్రోగ్రామ్ గురించి మరిన్ని వివరాలు:
భారతదేశంలో ఏ ప్రాంతానికి చెందిన, ఏ పరిమాణానికి చెందిన దుకాణదారులు మరియు రిటైలర్లు అయినా ‘లోకల్ షా ప్స్ ఆన్ అమెజాన్’ ప్రోగ్రామ్ లో చేరవచ్చు మరియు దాని నుంచి ప్రయోజనం పొందవచ్చు. కొనుగోలుదారులకు వేగంగా డెలివర్ చేసేందుకు వారు తమకు ప్రస్తుతం గల మెకానిజమ్స్ ను ఉపయోగించవచ్చు. దుకాణదారులు తాము అదే రోజు లేదా మరుసటి రోజు డెలివరీ చేయగల ప్రాంతాలను (పిన్ కోడ్ ను బట్టి) ఎంచుకునేందుకు ఈ ప్రోగ్రామ్ వీలు కల్పిస్తుంది. అంతేగాకుండా ప్రోడక్ట్ డెమానిస్ట్రేషన్, ఇన్ స్టాలేషన్ సపోర్ట్, సులభ కస్టమైజేషన్స్ మరియు డివైజ్ డేటా ట్రాన్స్ ఫర్ లాం టి అదనపు విలువ జోడించిన సేవలు అందించడం ద్వారా కస్టమర్ విశ్వాసాన్ని పొందవచ్చు. అమెజాన్ కు  మరియు కస్టమర్లకు కచ్చితమైన డెలివరీ అప్ డేట్స్ అందించడంలో లోకల్ షాప్స్ కు తోడ్పడేందుకు అమెజాన్ ఒక ప్రత్యేక ‘డెలివరీ యాప్’ ను రూపొందించింది. కొనుగోలుదారులు వారు కోరుకున్న వాటిని పొందగలిగేలా అన్ని షిప్ మెంట్స్ కూడా ప్రతిరోజూ కీలక పరామితుల ద్వారా ట్రాక్ చేయబడుతాయి. అమెజాన్. ఇన్ పై హోమ్ మరియు ప్రోడక్ట్ పేజ్ లపై నూతన క్యూరేటెడ్ ‘లోకల్ షాప్స్ / షాప్స్ నియర్ యు’ సెక్షన్ ఉంటుంది.  లోకల్ షాప్స్ అందించే అన్ని అదనపు సేవలు కూడా డిటేల్స్ పేజ్ లో హైలెట్ అయి ఉంటాయి.

More Press Releases