హైదరాబాద్ నగర పరిధిలో కరోనా నియంత్రణ చర్యలు తదితర అంశాలపై మంత్రి తలసాని సమావేశం

Related image

హైదరాబాద్: నగర పరిధిలో కరోనా నియంత్రణ చర్యలు, బియ్యం పంపిణీ, వలస కూలీల సమస్యలు తదితర అంశాలపై పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రులు, మల్లు, mlc లతో సమావేశం నిర్వహించారు.శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ghmc పరిధిలోని మేయర్ బొంతు రాంమోహన్, హోంమంత్రి శ్రీ మహమూద్ అలీ, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, mp రంజిత్ రెడ్డి, మాజీ హోం మంత్రి నాయిని నరసింహా రెడ్డి, నామినేట్ mla స్టీఫెన్ సన్, mlc లు ఎగ్గే మల్లేశం, ప్రభాకర్, mla లు మాగంటి గోపినాద్, ముఠా గోపాల్, అరికెపూడి గాంధీ, కాలేరు వెంకటేష్, దానం నాగేందర్, వివేక్, ప్రకాష్ గౌడ్, సుభాష్ రెడ్డి, TS UFIDCL చైర్మన్ విప్లవ్ కుమార్, కంటోన్మెంట్ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ లాక్ డౌన్ నేపద్యంలో తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి ఒకొక్కరికి 12 కిలోల బియ్యం, కుటుంబానికి 1500 రూపాయల నగదు, వివిధ రాష్ట్రాల నుండి ఉపాధి కోసం వచ్చిన వారికి ఒకొక్కరికి 12 కిలోలు బియ్యం, 500 రూపాయల నగదు పంపిణీ చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. నగర పరిధిలో తెల్ల రేషన్ కార్డు లేనివారు, బియ్యం అందని వలస వచ్చిన వారు అనేక మంది ఉన్నారని, వారి సమాచారం సేకరిస్తే వారిని ఆదుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఎంతో దోహదపడుతుందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇప్పటికే నగర పరిధిలో 5 రూపాయల బోజన కేంద్రాల ద్వారా ప్రతిరోజూ ఉచితంగా భోజనం పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.

మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చొరవతో భవన నిర్మాణ కార్మికులకు క్రెడాయ్ సంస్థ ఆధ్వర్యంలో బోజన సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ప్రతిరోజూ అన్ని ప్రాంతాలలో mla లు, కార్పొరేటర్లు, trs పార్టీ నాయకులు, స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో పేదలు, వలస కూలీలకు బియ్యం నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. వాటిని ghmc, పోలీసు అధికారుల ద్వారా పంపిణీ చేసేలా చూడాలని అన్నారు. రహదారులపై ఆహారం పంపిణీ చేస్తున్న కారణంగా పెద్ద ఎత్తున గుమి గూడుతున్నారని, దీని ద్వారా కరోనా మరింత గా విస్తరించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. యాచకులు అందరిని ghmc ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన షెల్టర్ లకు తరలించేలా చూడాలని అన్నారు. ఈ షెల్టర్ లలో ౩ పూటల బోజన సౌకర్యం  కల్పించడం జరుగుతుందని, వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

షెల్టర్ ల ఏర్పాటు కోసం ఫంక్షన్ హాల్స్, ప్రభుత్వ విద్యాలయాలను వినియోగించుకోవచ్చని అన్నారు. సికింద్రాబాద్ లోని పలు ప్రాంతాలలో గురువారం ఒక్కరోజే రోడ్లపై ఉన్న సుమారు 200 మందిని వివిధ షెల్టర్ లకు తరలించినట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. త్వరలో అధికారులతో కూడిన మరో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. లాక్ డౌన్ కారణంగా వాహనాల రద్దీ లేనందున వివిధ ప్రాంతాలలో రహదారుల నిర్మాణ పనులు ఎంతో వేగంగా సాగుతున్నాయని, ప్రజాప్రతి నిధులు రోడ్ల నిర్మాణ పనులలో నాణ్యత ను పరిశీలించాలని చెప్పారు.

More Press Releases