చార్మినార్ వద్ద శానిటేషన్, ఎంటమాలజి, డీఆర్ఎఫ్ సిబ్బందికి సంఘీభావo తెలుపుతూ ప్రతిజ్ఞ

Related image

  • కరోనా వైరస్ పై ప్రభుత్వం, జిహెచ్ఎంసి పోరాడుతుంది
  • ప్రజలు ఇండ్లలోని ఉండి, సహకరించాలని మేయర్ బొంతు రామ్మోహన్ విజ్ఞప్తి
హైద‌రాబాద్‌, ఏప్రిల్ 24: కరోనా నియంత్రణలో నిరంతరం శ్రమిస్తున్న శానిటేషన్, ఎంటమాలజి, డీఆర్ఎఫ్ సిబ్బందికి సంఘీభావo తెలుపుతూ చార్మినార్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్బంగా మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ, ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావులు రెగ్యులర్ గా సమీక్షిస్తూ, యంత్రాంగానికి అండగా నిలుస్తున్నట్లు తెలిపారు.

జిహెచ్ఎంసి లో 25 వేలమంది శానిటేషన్, ఎంటమాలజీ, డీఆర్ఎఫ్ సిబ్బంది తమ కుటుంబమును వదిలి, ప్రాణాలకు తెగించి కరోనా నివారణకు కృషిచేస్తున్నారని తెలిపారు. కరోనా పాజిటివ్ కేసులకు ప్రభుత్వ  వైద్యులు, నర్సింగ్ సిబ్బంది తాము, తమ కుటుంబం కంటే సమాజ హితమే ముఖ్యమని సేవాభావంతో వైద్యసేవలు అందిస్తున్నట్లు వివరించారు. ఇదే సమయంలో తమను పట్టించుకోవడం లేదని పేర్కొంటూ, ప్రపంచంలోని పలుదేశాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని గుర్తుచేశారు. పాజిటివ్ కేసులు వున్నప్పటికీ భయపడకుండా ప్రజల కొరకు జీహెచ్ఎంసీ, పోలీస్, వైద్య శాఖల ఉద్యోగులు శ్రమిస్తున్నారని తెలిపారు.

ప్రజల కొరకు ప్రభుత్వం చేస్తున్న కృషిని అర్ధం చేసువాలని కోరారు. కరోనా వైరస్ మీ ఇంటి గడప తొక్కకుండా మేము అందరం పనిచేస్తున్నాం. ఇండ్లలోనే ఉండి, సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పారిశుధ్య కార్మికులకు సైతం కుటుంబాలు వున్నాయి. విపత్కర పరిస్థితుల్లో పని చేస్తున్న కార్మికులకు ప్రభుత్వం పూర్తిగా జీతంతో పాటు, రూ 7500/- లను  ప్రోత్సాహకంగా ఇస్తున్న ట్లు తెలిపారు. హైదరాబాద్ నగరంలో శానిటేషన్ పరిస్థితి ఇతర నగరాల కంటే మెరుగుగా వున్నదని తెలిపారు. కార్మికుల సేవలను గౌరవిస్తూ, సంఘీభావం ప్రకటించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్ మాట్లాడుతూ నగరం పరిశుభ్రoగా ఉంచుతూ, కరోనా వ్యాప్తిని అరికట్టుటలో నిరంతరం శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికులకు ధన్యవాదములు తెలిపారు.

జీహెచ్ఎంసీ లోని 25 వేల మంది శానిటేషన్, ఎంతమాలజి, డీఆర్ఎఫ్, ట్రాన్స్ పోర్ట్ సిబ్బంది పని చేస్తున్నారని తెలిపారు. మన హైదరాబాద్ సేఫ్ సిటీగా వున్నదని తెలిపారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావులు నిరంతరం మానిటరింగ్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే పారిశుద్యం, చెత్త తరలింపు, క్రిమి సంహారకాల స్ప్రేయింగ్ కు 3233 వాహనాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ఈ మహమ్మారి బారినుండి బయటపెడతామని తెలిపారు. అప్పటి వరకు ప్రజలందరూ ఇండ్లలోనే ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ లోకేష్ కుమార్, ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్, ఈ వి డి ఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, ఓ ఎస్ డి శ్రీనివాస్ రెడ్డి, జోనల్ కమీషనర్ సామ్రాట్ అశోక్, తదితరులు పాల్గొన్నారు.

More Press Releases