మెగాస్టార్ చిరంజీవి పిలుపు మేరకు రక్తదానం చేసిన జనసేన వీరమహిళ

మెగాస్టార్ చిరంజీవి పిలుపు మేరకు రక్తదానం చేసిన జనసేన వీరమహిళ
మెగాస్టార్ చిరంజీవి పిలుపు మేరకు జనసేన వీరమహిళ నిహారిక రక్తదానం చేశారు. ఆమె తన సహచరులు పదకొండు మందితో కలిసి చిరంజీవి బ్లడ్‌బ్యాంకుకి వచ్చి రక్తదానం చేయడం విశేషం. జనవరి 26 వ తేదీన నిహారిక ఆధ్వర్యంలో 63 మంది రక్తదానం చేశారు. సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా సరికొత్త రాజకీయాన్ని ఆవిష్కరించే క్రమంలో ఆవిర్భవించిన జనసేన పార్టీ ఉప్పల్ నియోజకవర్గంలో మహిళా విభాగంలో వీరమహిళ నిహారిక కీలక భూమిక నిర్వర్తిస్తున్నారు. అవసర సమయాల్లో జనసేన తరపున ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని తీసుకొస్తూనే.. సామాజిక సేవ కార్యక్రమాల్లో సైతం ఆమె చురుగ్గా పాల్గొంటున్నారు. ఇంతవరకు పవన్ కల్యాణ్ ని కలవలేదు. ఎంతో నిస్వార్థంగా పని చేస్తున్న వీర మహిళగా పరిగణించివచ్చు. మెగాస్టార్‌ చిరంజీవి అంటే అమితమైన ప్రేమ కలిగిన నిహారిక.. ఆయన పిలుపునకు స్పందించి రక్తదానం చేయడం ముదావహం.
Hyderabad
Janasena

More Press News