పశుగ్రాసం కొరత లేకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి: తెలంగాణ మంత్రి తలసాని

Related image

వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకొని జీవాలకు పశుగ్రాసం కొరత లేకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అధికారులు, సిబ్బందికి మాస్క్ లు, శానిటైజర్ లు, గ్లౌస్ లను మంత్రి పంపిణీ చేశారు. కరోనా మహమ్మారి భారిన పడకుండా విధి నిర్వహణలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, డైరెక్టర్ లక్ష్మారెడ్డి, TSLDA CEO మంజువాణి, పలువురు DVAHO లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ మూగజీవాల ఆకలిని గుర్తించి తీర్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. గోశాలల నిర్వాహకులతో మాట్లాడి పశుగ్రాసం సరఫరా కు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంచార పశువైద్య శాలల ద్వారా జీవాలకు వైద్యసేవలు సక్రమంగా అందేలా ప్రతిరోజూ పర్యవేక్షించాలన్నారు. కరోనా నేపద్యంలో కొందరు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అధిక ధరలకు మాంసంను విక్రయిస్తున్నారనే పిర్యాదులు అందుతున్నాయని, అధికారులతో ప్రత్యెక బృందాలను ఏర్పాటు చేసి మాంసం దుఖాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు.

అధిక ధరలకు విక్రయించే వారిపై కటిన చర్యలు తీసుకోవాలని, మాంసం ధరలు నియంత్రణలో ఉండేలా అవసరమైన చర్యలను చేపట్టాలని  ఆదేశించారు. నగరంలో అక్రమంగా నిర్వహిస్తున్న స్లాటర్ హౌస్ ల సమాచారం సేకరింఛి నివేదిక సమర్పించాలని అన్నారు. గోపాలమిత్రల కు పెండింగ్ ఉన్న 4 నెలల వెతనాలలో 2 నెలల వేతనాలను ఈ రోజు విడుదల చేస్తున్నట్లు, త్వరలోనే మిగిలిన 2 నెలల వేతనాలు చెల్లించడం జరుగుతుందని మంత్రి వివరించారు.

పశుసంవర్ధక శాఖ కార్యక్రమాలపై కేంద్రమంత్రి ఫోన్:

కరోనా నేపద్యంలో రాష్ట్రంలో అమలవుతున్న లాక్ డౌన్ పై కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ వాకబు చేశారు. సోమవారం మద్యాహ్నం రాష్ట్ర మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కేంద్రమంత్రి ఫోన్ చేసి రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో వచ్చే నెల 7 వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడగిస్తూ తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించగా, లాక్ డౌన్ ను మే 7 వరకు పొడగిస్తూ ముఖ్యమంత్రి మంచి నిర్ణయం తీసుకున్నారని కేంద్రమంత్రి తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం 20 వ తేదీ నుండి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న లాక్ డౌన్ సడలింపును అమలు చేయడం లేదని మంత్రి శ్రీనివాస్ యాదవ్ వివరించారు. ప్రత్యేక టీం లను ఏర్పాటు చేసి రాష్ట్రంలో చేపలు, మాంసం, గ్రుడ్లు, పశుగ్రాసం ఆయా ప్రాంతాలకు సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్రంలో చేపలు, మాంసం, పశుగ్రాసం లబ్యత, పంపిణీ తదితర అంశాలపై వాకబు చేసిన కేంద్రమంత్రికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు. కరోనా నుండి రక్షణ చర్యలలో భాగంగా పశుసంవర్ధక శాఖా సిబ్బందికి గ్లౌస్ లు, శానిటైజర్ లు పంపిణీ చేసినట్లు వివరించిన మంత్రి శ్రీనివాస్ యాదవ్.

More Press Releases