ఆర్ధిక మాంధ్యం ఉన్నా.. రోజుకు రూ.4వేల కోట్ల ఆదాయం రాకున్న సీఎం లాక్ డౌన్ కొనసాగిస్తున్నారు: తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్

Related image

*ప్రజల రక్షణే పరమావధిగా, బతికుంటే చాలు అని అన్ని ఫణంగా పెట్టి రక్షణ కవచంగా నిలబడుతున్నారు*
*ప్రభుత్వయంత్రాంగం అహర్నిషలు కృషి చేస్తోంది*
*ప్రాణాలకు తెగించి డాక్టర్లు పోరాడుతున్నారు*
*నిత్యం రోడ్ల మీద కుటుంబాలకు దూరంగా పోలీసులు పనిచేస్తున్నారు*
*పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో గ్రామాలు శుభ్రం చేసుకుని వైరస్ కట్టడి చేయగలిగాం*
*కరోనా వైరస్ నియంత్రణలో సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు*
*కరోనా రోజురోజు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతోంది*
*అదృష్టం కొద్ది మహబూబాబాద్ లో ఒక్క కేసు మాత్రమే పాజిటివ్ ...అతను కూడా  కోలుకుని డిశ్చార్జి అయ్యారు*
*మహమ్మారికి మందు లేదు..స్వీయ నియంత్రణ, లాక్ డౌన్ లే మార్గాలు*
*యాసంగిలోనూ అధిక దిగుబడి వచ్చింది....*
*అసాధ్యాన్ని సుసాధ్యాన్ని చేసిన గొప్ప నాయకుడు సిఎం కేసిఆర్*
*రైతుల కళ్లలో సంతోషం కనపడుతోంది*
*కరోనాను అడ్డుపెట్టుకుని రైతులను మోసం  చేయొద్దని కోరుతున్నాను*
*ప్రతి గింజను కొంటాము...రైతు వద్దకే ధాన్యం కొనుగోళ్లు*
*పెద్దతండాలో తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్*

మహబూబాబాద్, ఏప్రిల్ 18 : ఆర్ధిక మాంధ్యం ఉన్నా, రాష్ట్రానికి నెలకు దాదాపు 4000 కోట్ల రూపాయలు వచ్చే ఆదాయం రాకున్నా..ప్రజల రక్షణే పరమావధిగా అన్ని ప్రయోజనాలను ఫణంగా పెట్టి ముఖ్యమంత్రి కేసిఆర్ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా రక్షణ కవచంగా నిలుస్తున్నారని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. నేడు మహబూబాబాద్ జిల్లా, కురవి మండలం, మంత్రి స్వగ్రామం పెద్ద తండాలో మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికి మీడియా ప్రతినిధులకు నిత్యావసరాలు అందించారు.

కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో నేడు ప్రభుత్వ యంత్రాంగం అహర్నిషలు కృషి చేస్తోందని, డాక్టర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నారని, పోలీసులు కుటుంబాలకు దూరంగా నిత్యం రోడ్ల మీద ఉంటున్నారని, స్వీయ నియంత్రణ పాటిస్తూ ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారని, వీరందరికి ధన్యవాదాలు అన్నారు. కరోనా వైరస్ వస్తుందని ముందే తెలిసినట్లు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసిఆర్ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పెట్టి పల్లెలు, పట్టణాలు శుభ్రం చేయించారని, తద్వారా కరోనా వైరస్ కట్టడికి ఇదొక మంచి మార్గం అయిందన్నారు.

ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయని, అందుకే లాక్ డౌన్ పొడగించి కొనసాగిస్తున్నట్లు మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ మహమ్మారికి మందు లేదని, స్వీయం నియంత్రణ, లాక్ డౌన్ లు మాత్రమే మార్గాలన్నారు. అదృష్టవశాత్తు మహబూబాబాద్ లో ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్ కేసు మాత్రమే వచ్చిందని, అతను కూడా కోలుకుని డిశ్చార్జి అయ్యారని తెలిపారు. కురవి వీరభద్రస్వామి, భద్రకాళిల ఆశీర్వాదంతో ఇంకా ఎలాంటి కేసులు పాజిటివ్ రావద్దని కోరుకుంటున్నట్లు చెప్పారు.

ముఖ్యమంత్రి కేసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణలో అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం వల్ల నేడు యాసంగిలో కూడా పంట దిగుబడి అధికంగా ఉందని, రైతుల కళ్లలో సంతోషం కనిపిస్తోందని తెలిపారు. కరోనాను అడ్డుపెట్టుకుని రైతులను ఎవరూ కూడా మోసం చేసే ప్రయత్నం చేయవద్దని కోరారు. రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని, అందుకే రైతు వద్దకే వెళ్లి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ధాన్యం సేకరణ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ కుమారి అంగోతు బిందు, జడ్పీటీసి బండి వెంకట్ రెడ్డి, పెద్ద తండా సర్పంచ్ వనజా శ్రీరామ్, ఆర్డీవో కొమురయ్య, డిఎస్సీ నరేష్ కుమార్, ఇతర అధికారులు, నేతలు పాల్గొన్నారు.

More Press Releases