ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం: తెలంగాణ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

Related image

  • రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
  • వ‌రి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి అల్లోల‌
ముధోల్, ఏప్రిల్ 18: రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. లోకేశ్వ‌రం మండ‌లం అబ్ధుల్లాపూర్ లో  ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శ‌నివారం ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అతి తక్కువ కాలంలోనే వ్య‌వ‌సాయం రంగంలో అనూహ్యమైన ప్రగతిని నమోదు చేసుకున్నామ‌న్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దార్శనికత, ముందు చూపుతోనే సాధ్యపడిందన్నారు. గతంలో కంటే తెలంగాణ ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు పండించిన వరి దాన్యాన్ని వంద శాతం కొనుగోలు చేస్తుంద‌ని తెలిపారు. అన్న‌దాత‌ల‌ను ఆదుకునే దిశ‌గా ప్ర‌భుత్వం అనేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింద‌న్నారు. దేశంలో ఎక్క‌డ లేని విధంగా రైతుబంధు, రైతు బీమా ప‌థకాల‌ను ప్ర‌వేశ‌పెట్టింద‌న్నారు. రైతుల‌కు 24 గంట‌ల ఉచిత క‌రెంట్ ను ఇస్తుందని, దీని వ‌ల్ల‌ సుమారు రూ.7 వేల కోట్ల స‌బ్సిడీ భారం ప‌డుతున్న‌ప్ప‌టికీ రైత‌న్న‌ల మేలు కోసం ప్ర‌భుత్వమే భ‌రిస్తుంద‌ని తెలిపారు.

జిల్లాలో సాగు అయిన ప్రతి ఎకరంలో పండిన మక్కలు, వరి పూర్తి స్థాయిలో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఆరుగాలం శ్ర‌మించి పంట పండించిన రైతులు న‌ష్ట‌పోకూడ‌ద‌నే ఉద్ద‌శ్యంతో పౌరసరఫరాల శాఖ ఐకేపీ, పిఏసిఎస్, మార్క్ఫెడ్ ద్వారా కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా గ‌న్ని బ్యాగుల కొర‌త రాకుండా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని వివ‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో ముధోల్ ఎమ్మెల్యే విఠ‌ల్ రెడ్డి, జిల్లా కలెక్ట‌ర్ ముషార‌ఫ్ ఫారూఖీ, త‌దితరులు పాల్గొన్నారు.

More Press Releases