రెడ్ జోన్ పరిధిలోకి సూర్యపేట

Related image

  • మరింత కట్టుదిట్టంగా లాక్ డౌన్ 
  • వైరస్ వైరల్ కాకుండా చూడాల్సింది ప్రజలే
  • లింక్ ను తెంపేందుకే లాక్ డౌన్
  • అనుమానితులు స్వచ్చందంగా టెస్ట్ లు చేసుకుంటేనే లాక్ డౌన్ నుండి విముక్తి
  • కరోనా వైరస్ కు చికిత్సలు ఉచితం
  • చైన్ లింక్ తోటే సూర్యపేట లో పాజిటివ్ కేసులు
  • నిత్యావసర సరుకులు నేరుగా ఇంటికే
  • ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అప్రమత్తంగా ఉండాలి
  • గ్రామీణ ప్రాంతాలకు విస్తరించకుండా జాగ్రత్తలు
  • కరోనా వైరస్ పై అత్యవసర సమీక్షా
  • హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యపేట పట్టణాన్ని పూర్తిగా రెడ్ జోన్ పరిధిలో కీ వస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రకటించారు. అదే సమయంలో కరోనా వైరస్ గ్రామీణ ప్రాంతాల్లోకి వ్యాప్తిచెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.

లాక్ డౌన్ కు ముందే పరీక్షలకు పోయిన శాంపిల్స్ ఒక్కొక్కటిగా ఫలితాలు వెళ్లాడవుతున్న నేపద్యంలోనే గందరగోళం నెల కొందని అంతకు మించి ఏమి ఉండదని అంతా మంచే జరుగుతుందని మంత్రి జగదీష్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. చైన్ లింక్ తోటే వైరస్ వ్యాపించిందన్న సమాచారం అందుతుందని.. ఆ లింక్ ను తెంపేందుకే లాక్ డౌన్ ను మరింత కట్టుదిట్టం గా అమలు పరచాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు.

సూర్యపేట జిల్లా కేంద్రంలో కరోనా వైరస్ పాజిటివ్  కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపద్యంలో రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి స్థానిక శాసనసభ్యులు స్వయంగా రంగంలోకి దిగారు. ఒకే ఇంట్లో పెద్ద మొత్తంలో కరోనా సోకి పాజిటివ్ తో క్యారంటైన్ కు చేరుకున్నారన్న సమాచారం తో గురువారం రాత్రి సూర్యపేట కు చేరుకున్న ఆయన అందుబాటులో ఉన్న అధికారులతో పరిస్థితులు సమీక్షించారు. శుక్రవారం ఉదయం నుండి సూర్యపేట లో మకాం వేసిన మంత్రి జగదీష్ రెడ్డి ప్రజల్లో నెలకొని ఉన్న భయాందోళనలకు పులిస్టాఫ్ పెట్టేవిదంగా చర్యలకు ఉపక్రమించారు.
అందులో బాగంగా ఈ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో సూర్యపేట పురపాలక సంఘం కార్యాలయ భవన్ లో జిల్లా అధికార యంత్రాంగం తో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు.

రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, జిల్లా వైద్యఅధికారుల బృందం ఆర్ డి ఓ మోహన్ రావు ,మున్సిపల్ కమిషనర్ రామంజుల్ రెడ్డి తదితరులు పాల్గొన్న సమీక్ష లో పలు అంశాల పై సుదీర్ఘంగా చర్చించారు.

పరిస్థితులు అన్నింటినీ సమీక్షించిన మీదట మొత్తం సూర్యపేట పట్టణాన్ని రెడ్ జోన్ పరిధిలోకీ వస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి మీడియా సమావేశంలో ప్రకటించారు.దీనితో ప్రజలు ఎటువంటి ఇబ్బందులకు లోను కాకుండా ఉండేందుకు గాను కూరగాయలతో సహా నిత్యావసర సరుకులన్నీ నేరుగా ప్రజల యిండ్లకే చేరే విదంగా చర్యలు తీసుకున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.వైరస్ వైరల్ కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రజల కుందన్నారు.ఇప్పటికే ప్రారంభమైన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులను అప్రమత్తం చేశామన్నారు.ఇప్పటికైన వైరస్ సోకిందన్న అనుమానం ఉన్న వారు స్వచ్చందంగా ముందుకు వచ్చి పరీక్షలు జరిపించుకోవాలని ఆయన హితవు పలికారు. పరీక్షల తో చికిత్స లన్నింటిని ప్రభుత్వం ఉచితంగా నిర్వహిస్తోందని...ప్రజారోగ్యమే ప్రభుత్వం ముందున్న కర్తవ్యమన్నారు.వైరస్ ను పారద్రోలేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని అందులో ప్రజలు భాగస్వామ్యం అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం నెరవేరినట్లే నని ఆయన ఉద్బోధించారు.

More Press Releases