గర్భిణీ మహిళలకు కిట్స్ ని అందజేసిన మంత్రి హరీశ్ రావు

Related image

  • గర్భిణీ మహిళలు, ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు పోస్టిక ఆహారం అందాలని అధికారులను అదేశించిన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
కరోనా కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకొంటున్నామని అందులో భాగంగా సోమవారం అంగడిపేటలోని 800 మంది గర్భిణీ మహిళలకు కిట్స్ ని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గర్భిణీ మహిళలు అవసరమైన ప్రోటీన్ ఫుడ్, ఎగ్స్ ఐరన్ మాస్క్లు శానిటైజర్లను ఒక్క కిట్టుగా తయారు చేసి ఇవ్వడం జరిగినదని, ఈ కార్యక్రమము అంగడిపేట నుండి ప్రాంభించడం జరిగిందని తెలిపారు. గర్భిణీ మహిళలకు అవసరమైనా బలమైన ఆహారం అందిచాలని లేనియెడల ప్రసవ సమయములో చాల ఇబ్బందులు ఎదురుకొంటారని తెలిపారు. అదే విధంగా ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు కూడా బాగా కష్ట పడి రోజంతా పని చేస్తున్నారు కావునా వారికీ కూడా ఈ కిట్స్ ని పంపిణీ చేశామని, జిల్లాలోని గర్భిణీ మహిళలు, ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు ఈ రోజు రేపు లోపల జిల్లా అధికార యంత్రాగం మొత్తం ఈ కిట్స్ ని అందచేయడం జరుగుతుందని తెలిపారు.

More Press Releases