కూరగాయలను పంపిణీ చేసిన ఏపీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు

కూరగాయలను పంపిణీ చేసిన ఏపీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ: లాక్ డౌన్ నేపథ్యంలో పేద కుటుంబాలను ఆదుకోవాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆశయ సాధనలో భాగంగా మంత్రి వెలంపల్లి శ్రీనివాస రావు ఆధ్వర్యంలో సోమవారం పశ్చిమ నియోజకవర్గంలో 12,500 ఇళ్లకు కూరగాయలను శ్రీ విజ్ఞేశ్వర స్వామి దేవస్థానం కెనాల్ రోడ్డు వారి ద్రవ్య సహాయంతో ఈరోజు కూరగాయలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు కూరగాయల పంపిణీ మొదలుపెట్టి నియోజవర్గంలో 87,500 ఇళ్లకు కూరగాయలు అందజేసినట్లుగా మంత్రి వివరించారు. కార్యక్రమాన్ని పర్యవేక్షించిన వారిలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కొనకళ్ళ విద్యాధర రావు,  కొండపల్లి మురళి (బుజ్జి), ఆదిత్య, తుని గుంట్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
Vellampalli Srinivasa Rao
Corona Virus
Andhra Pradesh

More Press News