పేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేసిన తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Related image

తెలంగాణ రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి  శ్రీనివాస్ గౌడ్ కరోనా మహమ్మారి నిర్ములనలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్ డౌన్ వల్ల ఇంట్లో నుండి బయటికి వెళ్లలేని బీద మహిళలకు చేయూత నివ్వటానికి 10 రకాల నిత్యావసర వస్తువుల ప్యాకెట్ ను క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో కొంత మంది దాతల సహకారంతో ప్రత్యేకంగా తయారు చేసి లాల్ బహదూర్ స్టేడియంలో సుమారు 200 మంది పేద మహిళలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అల్లిపురం వేంకటేశ్వర రెడ్డి, కార్పొరేటర్ మమత గుప్త, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, ప్రముఖ షూటింగ్ క్రీడాకారిణి ఈషా సింగ్, TGO కేంద్ర సంఘం అధ్యక్షురాలు మమత, TNGO కేంద్ర సంఘం అధ్యక్షులు కారం రవీందర్ రెడ్డి, స్పోర్ట్స్ అధికారులు సుజాత, మనోహర్, పలువురు  క్రీడాకారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కరోనా మహమ్మారిని నియంత్రణలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముందస్తుగా తీసుకున్న నివారణ చర్యలు, ఏర్పాట్లు వల్ల దేశంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందన్నారు.

లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిత్యావసర వస్తువులు, అవసరమైన వస్తువులను ప్రభుత్వం నుండి, దాతల ద్వారా పేద, మధ్య తరగతి ప్రజలకు అందిస్తునామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

దేశంలోని వివిధ రాష్ట్రాలలోనున్న మహబూబ్ నగర్ కు చెందిన వలస కూలీలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి పంపారు. కానీ తెలంగాణ ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలను కంటికి రెప్పలా కాపుడుకోవడం జరుగుతుందన్నారు.

కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా ప్రజలంతా సామాజిక దూరం పాటించి కరోనాను నియంత్రణ చేయాలన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలను ఆదుకోవడానికి క్రీడాకారులు ముందుకు రావాలన్నారు. ఇప్పటికే గోపి చంద్, సానియా మీర్జా, సింధు, సైనా నెహ్వాల్, మిథాలి రాజ్ లాంటి క్రీడాకారులు ముందుకు వచ్చారు. దాతలు ఇపుడు తమ దేశభక్తిని సేవ ద్వారా చాటాలని మంత్రి పిలుపునిచ్చారు.

More Press Releases