కరోనా వైరస్ పై గాంధీ వైద్య కళాశాల ప్రొఫెసర్ డా.రాజారావు సూచనలు!

కరోనా వైరస్ పై గాంధీ వైద్య కళాశాల ప్రొఫెసర్ డా.రాజారావు సూచనలు!

స్వీయ నియంత్రణతో, వ్యక్తిగత శుభ్రతతో కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చు అని గాంధీ వైద్య కళాశాల ప్రొఫెసర్ డా. రాజారావు పేర్కొన్నారు. బుధవారం సమాచార పౌరసంబందాల శాఖ ఆధ్వర్యంలో కోవిడ్ -19 పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

  • ప్రజలు అనవసరంగా భయభ్రాంతులకు గురి కావలసిన అవసరం లేదు. స్వీయ నియంత్రణ పాటిస్తూ, వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచన చేశారు.

  • ప్రభుత్వ ప్రకటించిన లాక్ డౌన్ ను ఖచ్చితంగా పాటించి కుటుంబ ఆరోగ్యంతో పాటు ప్రజారోగ్యాన్ని కాపాడాలి.

  • జలుబు/దగ్గు /గొంతునొప్పి/జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తే వైద్య సలహా తీసుకొని తదనుగుణంగా మందులు వాడాలి.

  • ముఖ్యంగా రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసులకు వైద్య అందించే డాక్టర్లకు, వైద్యసిబ్బందికి ఎటువంటి ఆరోగ్య సమస్య రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాము.

  • పిపి కిట్లు/మాస్క్ ల కొరత లేదు.

  • క్లోరో క్విన్ ను డాక్టర్ల సలహా మేరకే వాడాలి.

  • ప్రతి ఒక్కరు లాక్ డౌన్ ను కర్తవ్యంగా పాటించాలి.

  • డిశ్చార్జ్ అవ్వగానే సోసైటీ తో కలవకుండా హోం క్వారంటైన్ లో ఉండాలి.

యశోదా కన్సల్టెంట్ డా.యం.వి.రావు మాట్లాడుతూ:
  • వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలనే ప్రభుత్వం ఇచ్చే సూచనలను ప్రజలు కచ్చితంగా అమలు చేయాలన్నారు.

  • తరుచుగా చేతులను శుభ్రంగా కడుగుకోవాలి.

  • బాధ్యతారహితంగా వ్యవహరించవద్దు.

  • ఢిల్లీ నుంచి వచ్చిన వారు వెంటనే స్వీయ నియంత్రణ చేసుకొని డాక్టర్లను వెంటనే సంప్రదించి పరీక్షలు చేయంచుకోవాలి.

  • మానవీయతతో వ్యవహరించి వైద్యసిబ్బందికి సహకరించాలి.

  • వైద్య సౌకర్యం కోసం 104 కు ఫోన్ చేయండి.

  • ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా ఐసోలేషన్ వార్డులను అందుబాటులో ఉంచాము.

Gandhi Medical College
Hyderabad
Corona Virus
COVID-19
Telangana

More Press News