Jagan: కరోనా నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి..
Add ap7am to your home Screen

కరోనా నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం

కరోనా నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం
  • వృద్ధాశ్రమాలు, అనాధ బాలల సదనాలకు ఉచితంగా బియ్యం, కందిపప్పు
  • ఒక్కొక్కరికీ పది కిలోల బియ్యం, కిలో కందిపప్పు
  • మహిళా శిశు సంక్షేమ శాఖ సంచాలకులు కృతికా శుక్లా
కరోనా లాక్ డోన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం నిరుపేదలకు ఉపకరించేలా మరో వినూత్న కార్యక్రమం చేపట్టింది. వృద్ధాశ్రమాలు, అనాధ బాలల కేంద్రాలలో ఉన్న అభాగ్యుల కోసం ఉచితంగా బియ్యం, కంది పప్పు అందించాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి దమయంతి ఆదివారం ఈ మేరకు జిఓ నెంబర్ 58 జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ కమీషనర్ కృతికా శుక్లా ఈ నూతన కార్యక్రమం గురించి వివరాలను అందిస్తూ ప్రభుత్వేతర సంస్ధల నేతృత్వంలో నడుస్తున్న వృద్దాశ్రమాలు, బాలల సదనాలు కరోనా లాక్ డోన్ నేపధ్యంలో ఇబ్బందులు పడుతున్నారన్న విషయాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ తరహా సంస్ధలు అన్నింటిలో ప్రతి ఒక్కరికీ 10 కిలోల బియ్యం, ఒక కిలో కందిపప్పు ఇవ్వాలని  ఆదేశించారన్నారు. పౌర సరఫరాల సంస్ధ సంస్ధ ద్వారా వీటి పంపిణీ జరుగుతుందని, తమ శాఖ వద్ద ఎన్జిఓలు నిర్వహించే సంస్ధల వివరాలు సిద్దంగా ఉన్నాయని కృతిక శుక్లా తెలిపారు.
Jagan
Corona Virus
Andhra Pradesh

Watch Today's Deals on Amazon

More Press News