ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలని నిర్ణయించుకున్న ఆయన దయార్ద్ర హృదయానికి జేజేలు: పవన్ కల్యాణ్

ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలని నిర్ణయించుకున్న ఆయన దయార్ద్ర హృదయానికి జేజేలు: పవన్ కల్యాణ్

'సినిమా పరిశ్రమకు ఎటువంటి కష్టం వచ్చినా తక్షణమే స్పందించే నా పెద్ద అన్నయ్య  శ్రీ చిరంజీవి గారు సినీ కార్మికుల కోసం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించినందుకు ఆయన తమ్ముడిగా గర్వపడుతున్నాను. సినిమా పరిశ్రమలోని 24 విభాగాలలోని ప్రతీ టెక్నీషియన్, ప్రతీ కార్మికుని శ్రమ తెలిసిన వ్యక్తి శ్రీ చిరంజీవి గారు. సినిమానే నమ్ముకుని జీవిస్తున్న ఎందరో కార్మికులు, టెక్నీషియన్లు కరోనా దెబ్బతో ఉపాధి కోల్పోయి ఆర్ధికంగా అల్లాడిపోతున్నారు. అటువంటి వారిని ఆదుకోవడానికి పెద్దన్నగా ముందుకు వచ్చిన శ్రీ చిరంజీవి గారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలని నిర్ణయించుకున్న ఆయన దయార్ద్ర హృదయానికి జేజేలు పలుకుతున్నాను.' అంటూ పవన్ కల్యాణ్ ఓ ప్రకటన  చేశారు.

Pawan Kalyan
Chiranjeevi
Corona Virus

More Press News