శార్వరి నామ ఉగాది శుభాకాంక్షలు: పవన్ కల్యాణ్

శార్వరి నామ  ఉగాది శుభాకాంక్షలు: పవన్ కల్యాణ్

'తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సోదర సోదరీమణులు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. యావత్తు మానవాళి అంతా కరోనాతో గజగజలాడిపోతోంది. ఈ మహమ్మారి మానవ జాతిని కబళించడానికి పొంచి వుంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వస్తున్న శార్వరి నామ ఉగాది సర్వ జనులకూ మేలు చేయాలని, సంపూర్ణ ఆయుష్షును ఇవ్వాలని నా తరపున, జనసైనికుల తరపున కోరుకుంటున్నాను. ఉగాది వేడుకలను ఇంటికే పరిమితం చేసుకుందాం. ఇంట్లో ఉన్న వస్తువులతోనే పండుగ జరుపుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రపంచానికి కరోనా ముప్పు తొలగిననాడే మనకు నిజమైన ఉగాది. ఆ ముప్పును పారద్రోలడానికి ప్రభుత్వ సూచనలను పాటిద్దాం. కలసికట్టుగా పోరాడదాం.' అంటూ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.

Janasena
Pawan Kalyan
ugadi

More Press News