క‌రోనా వైర‌స్ నిర్మూల‌నపై వ‌రంగ‌ల్ లో అధికారుల‌తో స‌మీక్షించిన మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు

Related image

క‌రోనా వైర‌స్ నిర్మూల‌న‌పై ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు, సూచ‌న‌లు, ప్ర‌జ‌లు అచ‌రిస్తున్న వైనాన్ని, జ‌రుగుతున్న చికిత్స‌లు, అందుబాటులో ఉన్న బెడ్లు, త‌దిత‌ర అంశాల‌ను వ‌రంగ‌ల్ అర్బ‌న్, రూర‌ల్ జిల్లా క‌లెక్ట‌ర్లు రాజీవ్ గాంధీ హ‌న్మంతు, హరిత‌, వైద్య‌శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం మీడియాతో మాట్లాడిన‌ మంత్రి ఎర్ర‌బెల్లి దయాక‌ర్ రావు.

మంత్రి ద‌యాక‌ర్ రావు కామెంట్స్:

క‌రోనా వైర‌స్... ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న విష‌యం తెలిసిందే. చైనా, ఇట‌లీ, అమెరికా లాంటి దేశాలు ఇబ్బందులు ప‌డుతున్నాయి.

ఇప్ప‌టికే ప్ర‌పంచంలోని ఒక‌టి రెండు దేశాలు త‌ప్ప అన్ని దేశాలు క‌రోనా బారిన ప‌డ్డాయి. అక్క‌డ ప్ర‌జ‌ల నిర్ల‌క్ష్యాలు... ప్ర‌భుత్వాల అల‌క్ష్యాల వ‌ల్ల క‌రోనా విజృంభించింది.

కానీ, మ‌న దేశం, రాష్ట్రం ముందుగానే మేల్కొన్న‌ది. అన్ని ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకున్న‌ది. బ‌య‌టి దేశాల నుంచి వ‌చ్చిన వాళ్ళ ద్వారా మాత్ర‌మే మ‌న దేశం, రాష్ట్రంలోకి క‌రోనా వ‌చ్చింది.

జ‌న‌తా క‌ర్ఫ్యూని పెడితే... ప్ర‌జ‌లు అద్భుతంగా స‌క్సెస్ చేశారు. ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాల ప్ర‌జ‌లంతా స్వ‌చ్ఛందంగా స్వీయ నిర్బంధాన్ని పాటిస్తున్నారు. వాళ్ళంద‌రికీ అభినంద‌న‌లు. ఇదే స్ఫూర్తిని ప్ర‌జ‌లు క‌రోనా ఖ‌త‌మ‌య్యే వ‌ర‌కు ప్ర‌ద‌ర్శించాలి. తెలంగాణ ప్ర‌జ‌లు, దేశ‌, ప్ర‌పంచ దేశాల‌కు ఆద‌ర్శంగా నిల‌వాలి.

ఇది ప‌రీక్షా కాలం...తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ తీసుకున్న చ‌ర్య‌లు స‌త్ఫ‌లితాలిస్తున్నాయి. లాక్ డౌన్ ప్ర‌క‌టించారు. మార్చి 31వ తేదీ దాకా ఎవ‌రూ బ‌య‌ట‌కు రావొద్ద‌ని ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు చెప్పింది.

ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు పాటించండి. మ‌న తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకుంటున్న అన్ని చ‌ర్య‌ల‌ను బ‌య‌టి దేశాల్లో ఉన్న మ‌న తెలంగాణ బిడ్డ‌లు అభినందిస్తున్నారు. అలాగే ప్ర‌పంచ దేశాలు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఆద‌ర్శంగా తీసుకుంటున్నాయి.

ముఖ్యమంత్రి కెసిఆర్ దూర దృష్టితో తెల్ల రేష‌న్ కార్డు ఉన్న ప్ర‌తి ఒక్క‌రికీ 12 కిలోల బియ్యం, రూ.1500  న‌గ‌దు అందిస్తున్నారు. నిత్యావ‌స‌రాల స‌రుకులు, కూర‌గాయ‌ల‌కు ఇబ్బందీ లేకుండా అన్ని చ‌ర్య‌లూ ప్ర‌భుత్వం తీసుకుంటున్న‌ది.

క‌రోనా అంత‌మ‌య్యే వ‌ర‌కు ప్ర‌జ‌లు తెలంగాణ ఉద్య‌మ చైత‌న్యాన్ని, స్ఫూర్తిని, ఐకమ‌త్యాన్ని చాటాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపు.

రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు  36 క‌రోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. వాళ్ళంద‌రికీ చికిత్స అందుతున్న‌ది. ఎవ‌రూ సీరియ‌స్ గా లేరు.

ఇంకా 97 మంది అనుమానితులు ఉన్నారు. వాళ్ళ ర‌క్త న‌మూనాలు ప‌రీక్ష‌లు చేస్తున్నారు.

అనుమానితుల‌ను కూడా 14 రోజుల పాటు క్వారంటైన్-ఆబ్జ‌ర్వేష‌న్ లో పెట్టి పంపిస్తున్నాం.

పూర్వ వ‌రంగ‌ల్ జిల్లాలో ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్కపాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. ఆందోళ‌న అవ‌స‌రం లేదు.

సికింద్రాబాద్, క‌రీంన‌గ‌ర్ ల‌లో క‌రోనా వైర‌స్ సెకండ్ స్టేజీలో ఉంది. అంటే బ‌య‌టి దేశాల నుంచి వ‌చ్చిన వాళ్ళ ద్వారా స్థానికులు కొంద‌రికి క‌రోనా వ్యాపించింది.

క‌రోనా వైర‌స్ బాధితుల ఐసోలేష‌న్ కోసం 15 వేల బెడ్లు రెడీగా ఉన్నాయి

ఇక్క‌డ ఎంజిఎంలో కూడా క‌రోనా బాధితుల కోసం బెడ్లు రెడీగా ఉన్నాయి. ఆ సెంట‌ర్ ని కూడా నేను ఇంత‌కు ముందే ప‌రిశీలించాను.

మ‌హ‌బూబాబాద్, భూపాల‌ప‌ల్లి, ములుగు, జ‌న‌గామ త‌దిత‌ర జిల్లా కేంద్రాల్లోనూ ఐసోలేష‌న్ కేంద్రాల‌ను ఏర్పాటు చేశాం.

క‌రోనా క‌ట్ట‌డి కోసం వివిధ శాఖ‌ల‌తో స‌మ‌న్వ‌యం కోసం స‌చివాల‌యంలో 24 గంట‌ల‌పాటూ ప‌ని చేసే విధంద‌గా కంట్రోల్ రూంని ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది.

సీనియ‌ర్ ఐఎఎస్ అధికారులు రాహుల్ బోజ్జ‌, అనిల్ కుమార్ లు ఇన్ చార్జీలుగా ప‌ని చేస్తున్నారు.

ప్ర‌భుత్వం 6 కేంద్రాల్లో ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న‌ది. హైద‌రాబాద్ లోని గాంధీ హాస్పిట‌ల్, చెస్ట్ హాస్పిట‌ల్, ఫీవ‌ర్ హాస్పిట‌ల్, సిసి ఎంబీ త‌దిత‌ర సెంట‌ర్ల‌లో ప‌రీక్షలు నిర్వ‌హిస్తున్నారు. ఇంకా స‌మ‌స్య‌లుంటే...అనుమానాలుంటే... పూణే కు కూడా పంపిస్తున్నారు.

ప్రైవేట్ మెడిక‌ల్ కాలేజీలు, ప్రైవేట్ హాస్పిట‌ల్స్ వాళ్ళ‌తో కూడా స‌మ‌న్వ‌యం చేస్తున్నాం. క‌రోనా విస్త‌రిస్తే ఇబ్బందులు లేకుండా ఆయా హాస్పిట‌ల్స్ ని కూడా వినియోగిస్తాం.

ఆరోగ్య‌శ్రీ తో టై అప్ అయిన  247 ప్రైవేట్ హాస్పిట‌ల్స్ లో కూడా ఐసోలేష‌న్ బెడ్లు ఏర్పాట్లు చేయ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నాం.

ప్ర‌భుత్వం లాక్ డౌన్ ని ప్ర‌క‌టించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌లెవ‌రూ ఇండ్ల‌ నుంచి బ‌య‌ట‌కు రావొద్దు

నిత్యావ‌స‌ర‌, అత్య‌వ‌స‌ర వ‌స్తువులు, మ‌రియు ప‌నులు ఉన్న కుటుంబాల్లో ఒక్క‌రికి మాత్ర‌మే బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు అనుమ‌తి ఉంది.

వ్య‌వ‌సాయ మ‌రియు పాల, మెడిక‌ల్ షాప్ ల‌కు మాత్ర‌మే మిన‌హాయింపు ఉంది

144 సెక్ష‌న్ అమ‌లు చేస్తున్నాం. గుంపులు గుంపులుగా ప్ర‌జ‌లు ఉండ‌కూడ‌దు.

విదేశాల నుంచి వ‌చ్చిన వాళ్ళు త‌ప్ప‌నిస‌రిగా త‌మంత తాముగా వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలి. వాళ్ళ‌కి క‌రోనా లేద‌ని తేలితేనే వారి ఇండ్ల‌కు పోవాలి.

లేక‌పోతే... పాస్ పోర్టు సీజ్ చేస్తారు. క‌ఠిన చ‌ర్య‌లు ప్ర‌భుత్వం తీసుకుంటుంది.

ఇత‌ర రాష్ట్రాల‌కు పోయే... మ‌న రాష్ట్రంలోని స‌రిహ‌ద్దుల‌న్నీ మూసి వేయ‌డం జ‌రిగింది.

ఆర్టీసి, ప్రైవేట్ వాహ‌నాల‌న్నీ  బంద్ చేశాం.

విద్యార్థుల‌కు అన్ని ర‌కాల పరీక్ష‌లు వాయిదా వేశాం.

రోడ్ల మీద అన‌వ‌స‌రంగా తిరిగితే... అలాంటి వాళ్ళ వాహ‌నాల‌ను సీజ్ చేస్తున్నాం

ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు తు.చ‌. త‌ప్ప‌కుండా పాటించాలి.

ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌న్నీ మ‌న బాగు కోస‌మే...ప్ర‌జ‌ల క్షేమం కోస‌మే కాబ‌ట్టి అన్ని విధాలుగా ప్ర‌జ‌లు ప్ర‌భుత్వానికి, పోలీసుల‌కి, అధికారుల‌కి స‌హ‌క‌రించాలి

ప్ర‌జ‌లు సామాజిక దూరాన్ని పాటించాలి. క‌నీసం మీట‌ర్ నుండి మూడు మీట‌ర్ల దూరం ఉండాలి.

ఇట‌లీ లాంటి దేశాలు చేసిన త‌ప్పులు మ‌నం చేయొద్దు. అన్ని ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోండి.

స్వ‌చ్ఛందంగా గృహ నిర్బంధాన్ని అంద‌రూ పాటించాలి.

క‌రోనా వైర‌స్ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే స్వ‌చ్ఛందంగా హాస్పిట‌ల్స్ కు వెళ్ళాలి. విదేశాల నుంచి వ‌చ్చిన వాళ్ళు... ఎట్టి  ప‌రిస్థితుల్లో క్వారంటైన్ కి వెళ్లండి. అలాంటి వారెవ‌రైనా ఉంటే...వాళ్ళని గుర్తించి హాస్పిట‌ల్స్ కి పంపండి. వాళ్ళు వెళ్ళ‌క‌పోతే, స‌మీప పోలీసుల‌కి, కార్పొరేష‌న్, మున్సిప‌ల్, పంచాయ‌తీ అధికారుల‌కు తెల‌పండి. హెల్ప్ లైన్ నెంబ‌ర్ల‌కు కాల్ చేయండి.

ఇదంతా మ‌న కోసం మ‌నం చేస్తున్న ప‌ని. మ‌న నిర్ల‌క్ష్యంతో మ‌నం ఆప‌ద‌లో ప‌డొద్దు. ఇత‌రులెవ్వ‌రినీ ఆప‌ద‌లోకి నెట్టొద్దు.

More Press Releases