అమర వీరులకు అంజలి: పవన్ కల్యాణ్

అమర వీరులకు అంజలి: పవన్ కల్యాణ్

'మార్చి 23.. భారతీయ చరిత్ర పుటలలో అత్యంత విషాదకరమైన రోజు. పిన్న వయస్సులోనే ఉరి కంబాన్ని ముద్దాడిన భరత మాత ముద్దు బిడ్డలు, విప్లవమూర్తులు అయిన భగత్ సింగ్, సుఖదేవ్ థాపర్, రాజ్ గురు అమరులైన రోజు. భారతీయులను దాస్య శృంఖలాల నుంచి విడిపించడానికి ఈ ముగ్గురూ దేశం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. ఇటువంటి పుణ్యమూర్తులను ఈ రోజే కాదు నిత్యం స్మరించుకోవడం ప్రతీ భారతీయుని విధి. ఈనాడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వతంత్రాలు ఆ మహనీయుల భిక్షే.. ఆ అమరవీరులకు నా తరఫున, జనసైనికుల తరఫున జోహార్లు అర్పిస్తున్నాను. ఆ మహానుభావులకు ప్రణామాలు చేస్తూ అంజలి ఘటిస్తున్నాను, జైహింద్' అంటూ పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.

Pawan Kalyan
Janasena

More Press News