హైకోర్ట్ ఆదేశాలు నాలుక గీసుకోడానికి పనికి రావా!.. యుబిపిఎస్ జాతీయ కన్వీనర్ కరణం తిరుపతి నాయుడు

Related image

అమరావతి మార్చ్ 16 : హైకోర్ట్ నోటీసు ఆర్డర్ ను దిక్కరించి పేద రైతులపై చేసుకున్నా దుర్గి తాహసిల్దార్, ఎస్ఐ, ఆర్ఐ లపై చర్యలు తీసుకోవాలని యునైటెడ్ బహుజన పోరాట సమితి (యుబిపిఎస్) జాతీయ కన్వీనర్ కరణం తిరుపతి నాయుడు డిమాండ్ చేశారు. పేద రైతులకు న్యాయం కోసం హైకోర్ట్ కు వచ్చిన సందర్బంగా బాదితులతో కలిసి ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు.

గుంటూరు జిల్లా దుర్గి మండలంలోని సర్వే నంబర్ 453/17లో గత 20 సంవత్సరాలుగా సుమారు 92 మంది పేదలు సాగు చేసుకొని జీవిస్తున్నారని తెలిపారు. ఇట్టి భూమికి విలువపెరుగటంతో అప్పట్లో దీనిని కాజేయాలని టిడిపి నేతలు ప్రయత్నించగా పేదలు అధికారులను ఆశ్రయించారని తెలిపారు. అధికారులు స్పందించక పోవడంతో హైకోర్ట్ ను ఆశ్రయించగా కోర్ట్ 2017లో నోటీసు ఆర్డర్ ను జారీ చేసినట్లు తెలిపారు.

దీనితో టిడిపి నేతలు వెనక్కు వెళ్లిపోయారని, కానీ పేదలకు న్యాయం చేస్తాడనుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక పేదలపై అరాచకాలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇట్టి భూమిపై కన్నేసిన వైసిపి ఎంఎల్ఏ పి.రామకృష్ణా రెడ్డి, అతని అనుచరులు ఈ భూమిపై కాజేయడానికి గతంలో టిడిపి వారి మాదిరిగా రైతులను భయబ్రాంతులకు గురిచేడమే కాకుండా భూమిలో పొలం చదును చేస్తుండగా దుర్గి ఎంఆర్ఓ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ, ఆర్ఐ, విఆర్ఓలు మరి కొంతమంది పోలీసులతో వచ్చి మహిళంటూ చూడకుండా 15 మంది మహిళలపై చేయి చేసుకొన్నారని తెలిపారు.

అంతే కాకుండా వారిని ఉదయం నుండి పోలీసు స్టేషన్ లో పెట్టి కొట్టారని ఆయన ఆరోపించారు. మాకు కోర్ట్ ఆర్డర్ ఉందని చెప్పినా అది నాలుక గీసుకోడానికి పనికి రాదని, కోర్ట్ ఆదేశాలకన్నా మాకు కలెక్టర్ ఆదేశాలు ఎక్కువని నానా దుర్బాశాలాడారని తెలిపారు. భూమిలో చదును చేస్తున్న జెసిబి యంత్రాన్ని స్వాదినం చేసి వారి భూమిని వారికి ఇప్పించాలని తిరుపతి నాయుడులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి విజ్నప్తి చేశారు. వైసిపి ఎంఎల్ఏ పి.రామకృష్ణా రెడ్డి, అతని అనుచరులు, ఎంఆర్ఓ, ఎస్ఐ, ఆర్ఐలనుండి ప్రాణ భయం ఉందని వీరి నుండి రక్షణ కల్పించాలని రాష్ట్ర డిజిపికి విజ్ఞప్తి చేశారు.

More Press Releases