Biswabhusan Harichandan: ద్వారకా తిరుమల సందర్శించండి.. ఏపీ గవర్నర్ కు..
Add ap7am to your home Screen

ద్వారకా తిరుమల సందర్శించండి.. ఏపీ గవర్నర్ కు ట్రస్టు బోర్టు సభ్యురాలు వినతి

ద్వారకా తిరుమల సందర్శించండి.. ఏపీ గవర్నర్ కు ట్రస్టు బోర్టు సభ్యురాలు వినతి
  • ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ కు ట్రస్టు బోర్టు సభ్యురాలు డాక్టర్ మాటూరి శ్రీవల్లి రంగనాధ్ వినతి
తెలుగు వారి నోట చిన్న తిరుపతిగా పేరుగాంచిన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనకు విచ్చేయాలంటూ ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ కు ట్రస్టు బోర్డు సభ్యురాలు డాక్టర్ మాటూరి శ్రీవల్లి రంగనాధ్ ఆహ్వానం పలికారు.

బుధవారం విజయవాడ రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన శ్రీవల్లి రంగనాధ్ ఈ మేరకు విన్నవించారు. ఎంతో చరిత్ర కలిగిన దేవస్ధానానికి అరుదెంచి స్వామి వారి ఆశీర్వాదం అందుకోవాలని పేర్కొన్నారు. ఇటీవలి ట్రస్టు బోర్డు నియామకం ద్వారా తనకు స్వామి వారి సేవ చేసుకునే అవకాశం లభించిందని వివరించిన డాక్టర్ మాటూరి శ్రీవల్లి రంగనాధ్, తమ కుటుంబం నేతృత్వంలోని అమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత 12 సంవత్సరాలుగా విద్య, వైద్యం, సాంస్కృతిక రంగాలలో విభిన్న సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని గవర్నర్ కు వివరించారు.

అమ్మ ట్రస్ట్ తరుపున నేటి యువతకు స్పూర్తి కలిగించేలా విభిన్న రంగాలలో సేవలు అందించిన ప్రముఖులను ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా సన్మానిస్తున్నామని తెలిపారు. 40 మంది చిరు వర్తకులకు వారి వ్యాపార అభివృద్దికి కోసం ద్విచక్రవాహానాలు పంపిణీ చేశామని, ఇప్పటి వరకు రాష్ట్రంలోని 50 దేవాలయాలకు నిత్యాన్నదానం పధకం కింద రూ.50 లక్షలు విరాళంగా అందించామని పేర్కొన్నారు. తమ ట్రస్టు నిర్వహించే సాంవత్సరిక వారికోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరు కావాలని ఈ సందర్భంగా శ్రీవల్లి రంగనాధ్ గవర్నర్ కు విన్నవించారు.

కార్యక్రమంలో ట్రస్ట్ ఛైర్మన్, అమ్మ కన్ స్ట్రక్షన్స్ అధినేత మాటూరి రంగనాధ్, బచ్చు పిచ్చేశ్వర గుప్తా, కాకి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Biswabhusan Harichandan
Andhra Pradesh

Watch Today's Deals on Amazon

More Press News