ఆంధ్రప్రదేశ్ లో ఓటర్లుగా నమోదైన గవర్నర్ దంపతులు!

ఆంధ్రప్రదేశ్ లో ఓటర్లుగా నమోదైన గవర్నర్ దంపతులు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఏపీలో ఓటు హక్కును పొందారు. ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్ విజయవాడ మధ్య నియోజక వర్గ పరిధిలో ఉండగా గవర్నర్ తో పాటు మహిళా గవర్నర్ సుప్రవ హరిచందన్ ఓటరుగా నమోదు అయ్యేందుకు అవసరమైన పత్రాలను ఎన్నికల అధికారులకు అందించారు.

గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా సూచనల మేరకు నియోజకవర్గ ఎన్నికల విభాగపు ఉప తహశీల్ధార్ నాగమణి మంగళవారం గవర్నర్ దంపతులకు సంబంధించిన ఓటరు నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అప్పటికప్పుడే వివరాలను సరి చూసుకున్న అధికారులు జిల్లా పాలనాధికారి ద్వారా రాష్ట్ర ప్రథమ పౌరునికి అతి త్వరలోనే ఓటరు కార్డును అందచేస్తామని తెలిపారు.
Biswabhusan Harichandan
Andhra Pradesh

More Press News