Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install
Advertisement

‘ఐ హేట్ మ్యారేజ్ ’ టీజర్‌ విడుదల

‘ఐ హేట్ మ్యారేజ్ ’ టీజర్‌ విడుదల
Advertisement
సుగి విజయ్, జుప్సీ భద్ర (తొలి పరిచయం) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఐ హేట్ మ్యారేజ్ ’ ఆర్య సినిమా బ్యానర్‌పై మాదం దయానంద్, కార్తిక్ వెంపటి కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంతో పరమేశ్‌ రేణుకుంట్ల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదల చేసిన 'అప్పుడే పెళ్లా' అనే లిరికల్‌ వీడియోకు అనూహ్యమైన స్పందన వచ్చింది. సోషల్‌ మీడియాలో ఈ సాంగ్‌ ట్రెండింగ్‌లో నిలిచింది. కాగా తాజాగా ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. 

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ 'ప్రేమ, పెళ్లి, కెరీర్‌తో పాటు స్వతంత్రంగా జీవించాలనే నేటి Gen Z తరం ఆలోచనలు, భావజాలాన్ని వాస్తవానికి దగ్గరగా చూపించే ప్రయత్నం ఈ చిత్రం.జీవితంలో యువత ఎదుర్కొనే భావోద్వేగాలు, నిర్ణయాలను సహజంగా ఆవిష్కరించే ప్రయత్నం ఈ చిత్రంలో కనిపించనుంది. ప్రతి యువత ఈ సినిమాలో క్యారెక్టర్స్‌తో కనెక్ట్‌ అవుతారు. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చే ఫ్రెష్ కంటెంట్‌ మా చిత్రంలో వుంది' అన్నారు. 

హారిక రాజేందర్, సాహితి కృష్ణ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్, రవివర్మ అడ్డూరి,ప్రభావతి, ఆశ్రిత వేముగంటి, లోహిత్ కుమార్,బేబి తమోఘ్న, రాధ రాయసం, లక్ష్మి, జాకీర్, విజయ్ కుమార్, దాసరి పద్మ రేఖ, శ్రీదేవి ఆర్రోజు, మెయిల్ రమేష్, అరుణ్ కుమార్ రెడ్డి, ప్రముఖ నటి ఇందు, అఖండ సుధాకర్ రెడ్డి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.
Advertisement
i hate marriage
i hate marriage teaser

Watch Today's Deals on Amazon

More Press News