Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install
Advertisement

నవంబరు 13న 'డానీ' చిత్రం విడుదల

నవంబరు 13న 'డానీ' చిత్రం విడుదల
Advertisement
రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కళ్యాణ్‌జీ కంటెంట్ పిక్చర్స్ బ్యానర్‌ల మీద రిజ్వాన్ నిర్మాణంలో కళ్యాణ్‌జీ గోగణ తెరకెక్కించి చిత్రం ‘డానీ’. ఈ మూవీలో ఆశిష్ గాంధీ, సేజల్ గుప్తా, సోనాల్ సింగ్, అజర్ ఖాన్ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. రొమాంటిక్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ స్ట్రైక్ అందరినీ ఆకట్టుకుంది. రా అండ్ రస్టిక్, బోల్డ్‌గా ఈ ఫస్ట్ స్ట్రైక్ ట్రేడ్ సర్కిల్స్‌లో అంచనాల్ని పెంచేసింది. ప్రేమకు, అలవాటుకు మధ్య ఉండే సంఘర్షణతో ఈ చిత్రాన్ని కళ్యాణ్‌జీ గోగన తెరకెక్కించారు.

జీవితంలో ఓ వ్యక్తికి ఉన్న అలవాట్లు ఏంటి? ఆ అలవాట్ల కారణంగా ఎలాంటి స్థితికి వెళ్లాడు.. ప్రేమలో పడ్డాక జీవితం ఎలా మారింది.. ఆ అలవాట్లకు, ఈ ప్రేమకు మధ్య ఏర్పడిన సంఘర్షణ ఏంటి? అన్నది ‘డానీ’ చిత్రంలో చూపించబోతోన్నారు. ‘నాటకం’ చిత్రంతో  కళ్యాణ్‌జీ గోగన–ఆశిష్ గాంధీ కాంబినేషన్‌పై ఆడియెన్స్‌లో మంచి అంచనాలు అయితే ఉంటాయి. ఆ అంచనాల్ని మించేలా ఈ ‘డానీ’ సినిమా ఉండబోతోంది. ఈ మూవీని నవంబర్ 13న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. 

ఈ మేరకు వదిలిన రిలీజ్ డేట్ పోస్టర్‌ అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంది. హీరో, హీరోయిన్లు పోస్టర్ మీద ఉన్న తీరు, ఆ పోస్టర్ డిజైన్ తీరు ఇలా అన్నీ కూడా కథను ప్రతిబింబించేలా ఉన్నాయి.

ఈ చిత్రానికి సాయి కార్తీక్ బీజీఎం ప్రధాన ఆకర్షణ కానుంది. ఈ మూవీకి ఖుషి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఏకే ఆనంద్ కెమెరామెన్‌గా, మణికాంత్ ఎడిటర్‌గా వర్క్ చేశారు. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమాను నవంబర్ 13న భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు.
Advertisement
Danny
Danny Release date

Watch Today's Deals on Amazon

More Press News