టీఎస్ ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావుచే 2020 క్యాలండర్ ఆవిష్కరణ!

టీఎస్ ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావుచే 2020 క్యాలండర్ ఆవిష్కరణ!

తెలంగాణ టాన్స్ కో సంస్థలోని పి అండ్ జి అసోసియేషన్ రూపొందించిన క్యాలండర్ ను సంస్థ సీఎండీ ప్రభాకర్ రావు తెలంగాణ విద్యుత్ సౌధలో ఆవిష్కరించారు .ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణని ప్రస్తావిస్తూ సంస్థలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడంలో భాగంగా జూట్ బ్యాగులను పంపిణీ చేశారు. అదే విధంగా కార్పొరేట్ సామజిక బాధ్యతలో భాగంగా ఇటీవల పిఅండ్ జి అసోసియేషన్ ఆధ్వర్యంలో టాన్స్ కో సంస్థ చేపట్టిన పబ్లిక్ పార్కులను శుభ్రం చేయడం వంటి వాటిని ప్రోత్సహిస్తూ ఇలాంటి పర్యావరణహిత కార్యక్రమాలు ఇతర అసోసియేషన్లకు కూడా ఆదర్శవంతం అయ్యేలా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని సిబ్బందిని మార్గనిర్దేశనం చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్పీడీసీఎల్ సీఎండీ గోపాల్ రెడ్డితో పాటు పిఅండ్ జి అసోసియేషన్ అధ్యక్షుడు గణేష్, భాస్కర్, భార్గవి, ఊర్మిళ దేవి, ఉమా, ఇతర అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Telangana
TS TRANSCO
Hyderabad
Calendar
Vidyut Soudha

More Press News