'నాగబంధం' ఆడియన్స్‌కు గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది: నిర్మాతలు

'నాగబంధం' ఆడియన్స్‌కు గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది: నిర్మాతలు
 విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ 'నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్'. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జూలై 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.


-మేము సాఫ్ట్‌వేర్ కంపెనీని విజయవంతంగా నిర్వహించాం. అక్కడి నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత బిజినెస్‌ను డైవర్సిఫై చేయాలనే ఉద్దేశంతో సినిమా పరిశ్రమను కూడా ఒక మంచి అవకాశంగా భావించాం. నాగబంధం కంటే ముందు మరో కథ విన్నాం. అది చాలా పెద్ద హీరోతో చేయాల్సిన భారీ ప్రాజెక్ట్. అయితే అప్పటికి మేము నిర్మాతలుగా నిరూపించుకోలేదు కాబట్టి ఆ అవకాశం రాలేదు.

- రవీందర్ రెడ్డి గారు అభిషేక్ నామా గారి వద్ద ఉన్న స్క్రిప్ట్ గురించి చెప్పారు. అలా మేము అభిషేక్ గారిని కలిశాం. ఆయన విజన్ మాకు చాలా నచ్చింది. పెద్ద స్థాయిలో సినిమా చేయాలనే ఆలోచనతో నాగబంధం మొదలైంది. కథ అభివృద్ధి చెందుతున్న కొద్దీ మా నమ్మకం పెరిగింది. నాగబంధం కంటెంట్ పై వున్న నమ్మకంతో రూ.110 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించాం.
 
-మొదటి నుంచి క్రియేటివ్ ఫీల్డ్‌పై మాకు ఆసక్తి ఉంది. అయితే కేవలం పేరు కోసం మేము ఈ రంగంలోకి రాలేదు. సాఫ్ట్‌వేర్ రంగంలోనే మేము మంచి గుర్తింపు సంపాదించాం. బిజినెస్‌ను విస్తరించే క్రమంలో రియల్ ఎస్టేట్, ఫార్మా లాంటి రంగాలతో పాటు సినిమా కూడా ఒక మంచి రంగమని భావించాం.

సినిమా అనేది రిస్కీ బిజినెస్ కదా?
-రిస్క్ అనేది అన్ని రంగాల్లో ఉంటుంది. మేము స్టార్టప్ ప్రారంభించినప్పుడు ఆ ట్రెండ్ అసలు లేదు. అప్పట్లో బీటెక్ చేసి అమెరికా వెళ్లి మంచి ఉద్యోగం సంపాదించి స్థిరపడాలనే ఆలోచనే ఎక్కువగా ఉండేది. కానీ మేము ఆ ట్రెండ్‌ను బ్రేక్ చేశాం. ఐఐటీ గ్రాడ్యుయేట్స్ అయినప్పటికీ నాలుగేళ్ల పాటు ఎలాంటి ఆదాయం లేకుండా కష్టపడ్డాం.  మాపై మాకు ఉన్న నమ్మకం ఈ స్థాయికి తీసుకొచ్చింది. అదే నమ్మకంతో సినిమా రంగంలో కూడా రిస్క్ తీసుకున్నాం.

విరాట్ కర్ణ, దర్శకుడిగా అభిషేక్ నామా ఇద్దరూ కొత్తవారే. ఇంత భారీ బడ్జెట్ పెట్టడానికి కారణం ఏమిటి?
-మాకు కంటెంట్‌పై బలమైన నమ్మకం ఉంది. లార్జర్ దాన్ లైఫ్ మైథాలజికల్ కథతో సినిమా చేయాలనే ఆలోచన మొదటి నుంచే ఉంది. అభిషేక్ నామా గారు ఇంతకుముందు డెవిల్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా కోసం ఆయన అద్భుతమైన ప్రీ-ప్రొడక్షన్ వర్క్ చేశారు. ఆయన విజన్‌పై మాకు పూర్తి నమ్మకం ఉంది.

-హీరో కోసం వెతుకుతున్న సమయంలో విరాట్ కర్ణ ఈ పాత్రకు పర్ఫెక్ట్ అనిపించారు. ఈ సినిమా కోసం ఆయన అద్భుతంగా బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యి, ఎంతో అంకితభావంతో పనిచేశారు.

ఫైనల్ అవుట్‌పుట్ చూసి సంతృప్తిగా ఉన్నారా?
-చాలా హ్యాపీగా ఉన్నాం. విజువల్స్ అన్నీ అద్భుతంగా వచ్చాయి. మేము పెట్టిన ప్రతి రూపాయి తెరపై కనిపించాలనే ఉద్దేశంతో ఈ సినిమాను నిర్మించాం. మేము ఊహించిన దానికంటే గొప్పగా సినిమా వచ్చింది. నాగబంధం నిజంగా ఒక విజువల్ స్పెక్టాకిల్.

ఇది డివోషనల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న సినిమా కదా... మీ వ్యక్తిగత జీవితంలో కూడా ఆధ్యాత్మికత ఉందా?
మేము ఆధ్యాత్మికతను విశ్వసించే వాళ్లం. ప్రతి రోజు శివుని అభిషేకంతోనే మా రోజు ప్రారంభమవుతుంది. సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేని మేము ఇంత భారీ సినిమా చేయడం కూడా ఒక దైవ అనుగ్రహంగా భావిస్తున్నాం. రథయాత్ర సమయంలో ఎంత వర్షం కురిసినా యాత్ర విజయవంతంగా సాగుతోంది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

-కార్తీక పౌర్ణమి రోజున ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ జరిగింది. అదే రోజు 24 గంటల పాటు అభిషేకం జరిగింది. అదంతా శివుడు, అనంత పద్మనాభస్వామి ఆశీర్వాదంతోనే జరుగుతోందనే భావన కలిగింది.

-ఈ సినిమా కోసం వేసిన అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్‌ను చూసిన ప్రతి ఒక్కరూ నిజమైన ఆలయానికి వచ్చిన అనుభూతి కలుగుతోందని చెబుతున్నారు.

మీరు నిర్మాతలుగా కొత్తవారు కదా... బిజినెస్ విషయంలో ఎవరి సహాయం తీసుకున్నారు?
-మేము కొత్తవారమే అయినప్పటికీ అభిషేక్ నామా గారికి ఇండస్ట్రీపై మంచి అవగాహన ఉంది. ఆయన నుంచి మాకు చాలా సపోర్ట్ లభించింది.

-ఇండస్ట్రీకి కొత్తవారమైనప్పటికీ అనంత పద్మనాభస్వామి రథయాత్ర రూపంలో చేసిన ప్రమోషన్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇలాంటి ప్రమోషన్ ఇప్పటివరకు ఎవరూ చేయలేదని చాలామంది ప్రశంసించారు.  

ఈ సినిమా నిర్మాణంలో ఎదురైన సవాళ్లు ఏమిటి?
-ఈ సినిమా కోసం భారీ సెట్లు నిర్మించాం. భారీ సెట్లు అంటే సహజంగానే ఖర్చులు పెరుగుతాయి. ఎక్కువ మంది సిబ్బంది అవసరం అవుతుంది. ఎక్కడ వరకు సెట్లు వేయాలి, ఎక్కడ వరకు విజువల్ ఎఫెక్ట్స్ ఉపయోగించాలి అనే నిర్ణయం తీసుకోవడం చాలా పెద్ద సవాలుగా అనిపించింది.

-ఈ సినిమాలో ప్రతి పది నిమిషాలకు ఒక అద్భుతమైన విజువల్ కనిపిస్తుంది. అలాంటి విజువల్స్‌ను అవుట్‌డోర్‌లో పొందడం సాధ్యం కాదు. ప్రేక్షకులకు ఒక విజువల్ ఫీస్ట్ అందించాలనే ఉద్దేశంతో ప్రతి సెట్‌ను ఎంతో శ్రద్ధగా రూపొందించాం.

పాన్ ఇండియా ప్రమోషన్స్ ఎలా ఉన్నాయి?
ప్రతి భాష నుంచి చాలా మంచి స్పందన వస్తోంది. విజువల్స్ చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. కొత్త స్టార్‌కాస్ట్‌తో సినిమా చేస్తున్నప్పటికీ, కంటెంట్ చూసిన తర్వాత అందరూ ప్రశంసిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ విశ్లేషకులు కూడా ట్రైలర్ చూసి, ఇది చాలా ప్రామిసింగ్‌గా ఉందని, సరైన స్థాయిలో ప్రేక్షకుల్లోకి తీసుకెళ్తే అద్భుత విజయం సాధిస్తుందని చెప్పారు.

-మార్కెటింగ్ విషయంలో కూడా ఎక్కడా రాజీ పడటం లేదు. నార్త్ ఇండియాలో కూడా భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తున్నాం.

ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందా?
-ఈ సినిమా మేము ఆశించిన స్థాయిలో విజయం సాధిస్తే కచ్చితంగా సీక్వెల్ రూపొందించే ఆలోచన ఉంది.

కొత్త కథలు వింటున్నారా?
-ప్రస్తుతం మా దృష్టంతా నాగబంధం విడుదలపైనే ఉంది. సినిమా విడుదలైన తర్వాత కొత్త కథలు వింటాం. వైవిధ్యమైన, కొత్త కంటెంట్‌తో సినిమాలు చేయాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నాం. 
Nagabandham
Nishitha Nagireddy
kishore Annapureddy
Nagabandham release date

Watch Today's Deals on Amazon

More Press News