జీ తెలుగు అందిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘అనగనగా ఒక రాజు’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్.. ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు!

జీ తెలుగు అందిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘అనగనగా ఒక రాజు’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్.. ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు!

హైదరాబాద్, 25 జూన్ 2026: వారం వారం సరికొత్త సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు ఈ వారం మరో సూపర్ హిట్ సినిమాను అందించేందుకు సిద్ధమైంది. కామెడీ ఎంటర్టైనర్ ‘అనగనగా ఒక రాజు’ సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా అందిస్తోంది. థియేటర్ వేదికగా ప్రేక్షకులను మెప్పించిన బ్లాక్బస్టర్ హిట్ అనగనగా ఒక రాజు ఈ ఆదివారం, జూన్ 28, సాయంత్రం 6 గంటలకు, మీ జీ తెలుగులో!

అనగనగా ఒక రాజు సినిమా భావోద్వేగాలు, హాస్యం, కుటుంబ విలువలు, ఆకట్టుకునే కథాంశంతో రూపొందింది. కామెడీ ఎంటర్టైనర్గా అందరి ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఇప్పుడు చిన్నపెద్ద తేడా లేకుండా కుటుంబం అంతా కలిసి ఆనందించేలా టెలివిజన్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్గా నిలిచిన ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టిమీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించగా రావు రమేష్, తారక్ పొన్నప్ప, తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

మారీ దర్శకత్వంలో, సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఊహించని ట్విస్ట్ లతో ప్రేక్షకులను మెప్పించింది. ఈ  సినిమాని జీ తెలుగు వేదికగా ఆదివారం మీరూ తప్పకుండా చూసేయండి!

సూపర్ హిట్ సినిమా అనగనగా ఒక రాజు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్.. ఈ ఆదివారం, మీ జీ తెలుగులో!

Hyderabad
Tollywood

Watch Today's Deals on Amazon

More Press News