మై హోమ్ అవతార్‌లో ఆధ్యాత్మిక విప్లవం.. పురాణపండ శ్రీనివాస్ సృజించిన ‘రెండు లక్షల’ గ్రంథాల మహా ఆవిష్కరణ!
నేటి ఆధునిక ఇంటర్నెట్, డిజిటల్ యుగంలోనూ పుస్తక పఠనానికి, ముఖ్యంగా ఆధ్యాత్మిక సాహిత్యానికి ఉన్న ఆదరణ తగ్గలేదని జంట నగరాల వేదికగా నిరూపితమైంది. హైదరాబాద్ నార్సింగి సమీపంలోని బహుళ అంతస్థుల నివాస సముదాయం 'మై హోమ్ అవతార్' శనివారం ఒక మహోజ్వల ఆధ్యాత్మిక ఘట్టానికి వేదికగా నిలిచింది. శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ సృజించిన శైవ, వైష్ణవ అనుగ్రహ గ్రంథాలు ఒకేసారి రెండు లక్షల ప్రతుల సంఖ్యలో ఆవిష్కరణ జరుపుకుని సరికొత్త చరిత్రను లిఖించాయి. ఇందులో ఒక గ్రంథం విష్ణు భగవానుడి వైభవాన్ని, మరొకటి శివ భగవానుడి అనుగ్రహాన్ని వివరించేవి కాగా.. ఒక్కో గ్రంథం లక్ష ప్రతుల చొప్పున మొత్తం రెండు లక్షల పుస్తకాలు ఒకే ప్రాంగణంలో కొలువుదీరడం నగర మేధో, భక్త సమాజాల్లో పెద్ద చర్చగా మారింది.
ఈ పవిత్రమైన ఉదాత్త కార్యాన్ని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య సౌహార్ద్ర హృదయంతో భక్త లోకానికి సమర్పించారు. వందలాది బాక్సుల్లో తరలివచ్చిన ఈ గ్రంథాల ఉత్సవాన్ని ఉత్పల జగన్మోహిని, గాంధీ చంద్రశేఖర్ బృందం సుమారు రెండున్నర గంటల పాటు పరమ భక్తి రసాత్మక వాతావరణంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య, గాంధీ చంద్రశేఖర్ పర్యవేక్షణలో భక్తులు లక్షలాది గ్రంథాలపై మల్లెలు, చేమంతి పూలను వెదజల్లుతూ పుష్పాభిషేకం చేశారు. మై హోమ్ అవతార్ ప్రముఖులు డి.ప్రభాకరరెడ్డి, సంకష్టహర హనుమాన్ దేవస్థానం చైర్మన్ టి. అంజన్ కుమార్, కార్యవర్గ ప్రతినిధి వినోద్ కుమార్ తదితరులు ఈ మహోత్సవంలో క్రియాశీలక పాత్ర పోషించి జ్యోతి ప్రజ్వలన చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ ఆధ్యాత్మిక ప్రసంగం సభికులను అమితంగా ఆకట్టుకుంది. పరమ రుషుల వరప్రసాదాలైన స్తోత్రాలకు ఆయన అందించే ముందుమాటలు, అరుదైన చిత్రాల సంకలనమే ఈ స్థాయి పాఠక ఆదరణకు కారణమని విజ్ఞులు కొనియాడారు. సభకు విచ్చేసిన భక్తులు ఒక్కొక్కరు వందల సంఖ్యలో పుస్తకాలను తమతో పాటు తీసుకెళ్లడం అక్కడి భక్తి తత్వానికి అద్దం పట్టింది.
పురాణపండ శ్రీనివాస్ అపురూప సంకలనం 'శ్రీమాలిక' గ్రంథం సుమారు 20 పునఃప్రచురణలకు నోచుకోవడం తెలుగు ప్రచురణా రంగంలో ఒక హాట్ టాపిక్‌గా మారింది. ఇది తిరుమల శ్రీనివాసుని అఖండ అనుగ్రహమేనని తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు హర్షం వ్యక్తం చేశారు. ఈ అద్భుత ఆధ్యాత్మిక యజ్ఞానికి సహకరించిన ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్‌పర్సన్ నారా భువనేశ్వరికి, బొల్లినేని కృష్ణయ్యకు మై హోమ్ అవతార్ వాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.