నారీ శక్తికి నిలువెత్తు నిదర్శనం అప్సర అవార్డ్స్ 2026.. ఈ శనివారం సాయంత్రం 5:30 గంటలకు మీ జీ తెలుగులో!
హైదరాబాద్, 27 మే 2026: మహిళల ప్రతిభ, సాహసం, వారి అచంచలమైన స్ఫూర్తిని గౌరవించే వేదిక అప్సర అవార్డ్స్. జీ తెలుగు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా స్ఫూర్తిదాయక మహిళలను గౌరవిస్తోంది. అదేవిధంగా, ఈ ఏడాది మరికొందరు మహిళామణులను పలు అవార్డులతో సత్కరించనుంది. గ్లామర్, ఎమోషన్, వినోదాల మేళవింపుగా సాగనున్న అప్సర అవార్డ్స్ 2026.. ఈ శనివారం (మే 30) సాయంత్రం 5:30 గంటలకు మీ జీ తెలుగులో!
టాలీవుడ్ తారలు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్న ఈ వేడుకకు ఎనర్జిటిక్ యాంకర్లు ప్రదీప్ మాచిరాజు, సుడిగాలి సుధీర్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. అంతేకాదు, జీ తెలుగు అప్సరల ర్యాంప్ వాక్ అందరినీ కట్టిపడేయనుంది. నేహా శెట్టి, మాజీ మిస్ ఇండియా మానస వారణాసి, ఖ్యాతి వంటి హీరోయిన్లు తమ ప్రత్యేక ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించనున్నారు. ప్రదీప్, యష్మి, నవ్య స్వామి అందించే మ్యూజికల్ మెడ్లీ, అలాగే సుధీర్ - కావ్యల డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఈ ఈవెంట్‌కు హైలైట్‌గా నిలవనున్నాయి.
ఈ వేడుకలో అత్యంత ఆకర్షణీయమైన అంశం 'అమ్మవారు' యాక్ట్. స్త్రీ శక్తిని, ఆమెలోని సహనాన్ని, దైవత్వంలోని వివిధ రూపాలైన దుర్గ, కాళి, అర్ధనారీశ్వర తత్వాలను కళ్ళకు కట్టినట్లు ఈ ప్రదర్శనలో ఆవిష్కరించనున్నారు. ఇది ప్రేక్షకుల మనసులను తాకేలా, స్త్రీలోని అంతర్గత బలాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన జయసుధ, జయప్రద, భూమిక చావ్లా, మీనా, రాశీ ఖన్నా, వరలక్ష్మి శరత్‌కుమార్, నివేదా థామస్, ప్రగతి వంటి ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేయనున్నారు. ఈ సందర్భంగా నారీ శక్తిని చాటిచెప్పేలా స్క్వాడ్రన్ లీడర్ రాగి రామచంద్రన్‌కు 'నారీ శక్తి అవార్డ్'ను అందజేయనున్నారు. అలాగే, 92 ఏళ్ల వయసులో కూడా వైద్యసేవలు అందిస్తున్న డాక్టర్ సూరి శ్రీమతికి, జయసుధ, జయప్రదలు కలిసి 'మాతృ మూర్తి అవార్డు'ను ప్రదానం చేయనున్నారు.
డ్రామా జూనియర్స్ కంటెస్టెంట్లు అందించే ప్రత్యేక ప్రదర్శనలు పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, దిగ్గజ నటులకు ఘన నివాళిని అర్పిస్తాయి. ఇలా అసాధారణమైన ప్రతిభావంతులు, నిజ జీవితంలో స్ఫూర్తినిచ్చే మహిళలు, టాలీవుడ్ ప్రముఖులు, జీ తెలుగు నటీనటుల సమక్షంలో జరగనున్న ఈ వేడుకను మీరూ మిస్ కాకుండా చూసేయండి!
నారీ శక్తిని గౌరవించే ప్రతిష్టాత్మక వేడుక అప్సర అవార్డ్స్ 2026, ఈ శనివారం సాయంత్రం 5:30 గంటలకు.. మీ జీ తెలుగులో!