జీ తెలుగు వీకెండ్‌ హంగామా: డ్రామా జూనియర్స్ సీజన్ 9 & చాంపియన్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్

జీ తెలుగు వీకెండ్‌ హంగామా: డ్రామా జూనియర్స్ సీజన్ 9 & చాంపియన్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్

హైదరాబాద్మే 20, 2026: సరికొత్త కార్యక్రమాలుసూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు అంతులేని వినోదాన్ని పంచుతున్న జీ తెలుగుఈ వీకెండ్‌ మరిన్ని కార్యక్రమాలతో కనువిందు చేసేందుకు సిద్ధమైంది. ఆరంభం నుంచి అశేష ప్రేక్షకాదరణ పొందుతున్న డ్రామా జూనియర్స్ రియాలిటీ షో మరో సీజన్తో వచ్చేస్తోంది. ఈ వారాంతంలో డ్రామా జూనియర్స్ సీజన్ 9 గ్రాండ్ లాంచ్తో పాటు రోషన్ మేక నటించిన ఛాంపియన్ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌తో ప్రేక్షకులను అలరించనుంది మీ జీ తెలుగు. డ్రామా జూనియర్స్ సీజన్ 9 మే 21 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ కానుండగామే 23 నుంచి ప్రతి శనిఆదివారాలు రాత్రి 9 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది.

గత ఎనిమిది సీజన్లలో యువ నటీనటులను తెరపైకి తీసుకువచ్చివారి జీవితాలను మార్చిన డ్రామా జూనియర్స్తెలుగు టెలివిజన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన చిల్డ్రన్స్ రియాలిటీ షోగా నిలిచింది. భావోద్వేగాలుఅద్భుతమైన ప్రదర్శనలుస్ఫూర్తిదాయకమైన ప్రయాణాలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ షోఅనేక మంది యువ నటులను సినిమాటెలివిజన్ రంగాలకు అందించింది. ఈ సీజన్‌కు ప్రముఖ యాంకర్ సుధీర్ హోస్ట్‌గా వ్యవహరించనుండగాప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడిడైనమిక్ లేడీ రోజాహీరో శ్రీకాంత్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. ఆకట్టుకునే చిన్నారుల ప్రదర్శనలుఆసక్తికరమైన సంభాషణలతో ప్రేక్షకులను మెప్పించేందుకు డ్రామా జూనియర్స్ సీజన్ 9 ఘనంగా ప్రారంభం కాబోతోంది. 

ఈ వీకెండ్ వినోదానికి అదనంగారైజింగ్ స్టార్ రోషన్ మేకఅనస్వర రాజన్ జంటగా నటించిన ఛాంపియన్ సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు ప్రసారం చేయనుంది జీ తెలుగు. యాక్షన్భావోద్వేగాలుమాస్ అప్పీల్ నిండిన ఈ చిత్రం యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా అలరించే సంపూర్ణ వినోదాత్మక చిత్రంగా థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించింది. డ్రామా జూనియర్స్ సీజన్ 9 గ్రాండ్ లాంచ్ఛాంపియన్ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్తో ఈ వారాంతాన్ని వినోదంతో నింపేందుకు వచ్చేస్తోంది మీ జీ తెలుగు!

అలరించే ప్రదర్శనలుఅసలైన సినిమాటిక్ వినోదాన్ని పొందాలంటే.. ఈ వారాంతంలో జీ తెలుగు తప్పక చూడండి!

zee telugu
drama juniors

Watch Today's Deals on Amazon

More Press News