"తిమ్మరాజుపల్లి టీవీ" మూవీ నుంచి 'నిజమేనా' లిరికల్ సాంగ్ రిలీజ్

"తిమ్మరాజుపల్లి టీవీ" మూవీ నుంచి 'నిజమేనా' లిరికల్ సాంగ్ రిలీజ్
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా "తిమ్మరాజుపల్లి టీవీ". తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. "తిమ్మరాజుపల్లి టీవీ" చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఈ రోజు "తిమ్మరాజుపల్లి టీవీ" సినిమా నుంచి 'నిజమేనా' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటను ఎమోషనల్ ఫీల్ తో వంశీకాంత్ రేఖన కంపోజ్ చేశారు. సనరే లిరిక్స్ రాయగా, యువ గాయని జయశ్రీ పల్లెం పాడారు. 'నిజమేనా నిజమేనా నే విన్నది నిజమేనా, నువు పలికిన ఆ మాటే పొరబడి విన్నానా, నిజమేనా నిజమేనా నువ్వన్నది నిజమేనా కను తెరిచి నీ ముందే కలనే కన్నానా, ప్రతి క్షణం నీ వెంటే ఇన్నాళ్లుగా తిరిగానే, నేనేమిటో కొంచెం కూడా అర్థం కాలేదా...' అంటూ  హార్ట్ టచింగ్ గా సాగుతుందీ పాట.
Thimmarajupalli TV
Kiran Abbavaram
"Nijamena
Tollywood
cinema

Watch Today's Deals on Amazon

More Press News