కొత్త కథతో నిజాయితీగా చేసిన సినిమా "తిమ్మరాజుపల్లి టీవీ" : కిరణ్ అబ్బవరం
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా "తిమ్మరాజుపల్లి టీవీ". తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. "తిమ్మరాజుపల్లి టీవీ" చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్ 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు హైదరాబాద్ లో "తిమ్మరాజుపల్లి టీవీ" సినిమా గ్రాండ్ రివీల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
నటుడు ప్రదీప్ కొట్టె మాట్లాడుతూ - నేను థియేటర్ ఆర్టిస్ట్ ను. చాలా ఆడిషన్స్ ఇస్తుంటా. ఈ సినిమాకు ఆడిషన్ చేసినప్పుడు కూడా అవకాశం వస్తుందా అనిపించేది. కానీ ఆడిషన్ టైమ్ లోనే నా క్యారెక్టర్ కు ఎలా నటించాలో డైరెక్టర్ మునిరాజు గారు క్లారిటీగా చెప్పేవారు. ఇప్పటికి కూడా ఇదంతా నిజమేనా అనిపిస్తోంది. కిరణ్ అన్న బాగుంటే మాలాంటి ఎంతోమంది కొత్త వాళ్లు బాగుంటారు. "తిమ్మరాజుపల్లి టీవీ" సినిమా చూస్తుంటే మీకు ఇంటి భోజనం చేస్తున్న ఫీల్ కలుగుతుంది. అన్నారు.
హీరోయిన్ వేద జలంధర్ మాట్లాడుతూ - ఈ సినిమాలోని ప్రతి క్రాఫ్ట్ కు పనిచేసిన ప్రతి ఒక్కరూ ఒక గిఫ్ట్ లాగ దొరికారు. మా అందరికీ ఈ సినిమా ఒక బహుమతి. తెరపై కనిపించాలనే మా అందరి కలను నెరవేర్చిన చిత్రమిది. నేను థియేటర్ ఆర్టిస్టును. మేము చేసిన ఒక నాటకం చూసి డైరెక్టర్ మునిరాజు గారు ఈ సినిమాకు సెలెక్ట్ చేశారు. ఆయన ఎంతో క్లారిటీగా మూవీని తెరకెక్కించారు. కిరణ్ గారు మా లాంటి యంగ్ టాలెంట్ అందరికీ అవకాశం ఇవ్వడం హ్యాపీగా ఉంది. ఆయన బాగుంటే మా లాంటి వాళ్లంతా బాగుంటారు. ఈ సినిమా చేస్తున్నప్పుడు రహస్య గారు ఎంతో సపోర్ట్ గా నిలిచారు. మా అందరి బాగోగులు చూసుకున్నారు. రహస్య గారికి స్పెషల్ థ్యాంక్స్ చెబుతున్నాం. అన్నారు.
డైరెక్టర్ వి.మునిరాజు మాట్లాడుతూ - నాపై నమ్మకం ఉంచి "తిమ్మరాజుపల్లి టీవీ" సినిమా డైరెక్ట్ చేసే అవకాశం కల్పించిన కిరణ్ అన్నకు థ్యాంక్స్. ఆయన గురించి ఏం చెప్పాలి, ఒక అన్న గురించి, తండ్రి గురించి మనం బయటకు చెప్పుకోం, మనసులోనే దాచుకుంటాం. కిరణ్ అన్న నాకు అలాంటి వారు. రితికేష్ గోరక్ అన్న, రహస్య గారు, కిరణ్ అన్న...ఈ ముగ్గురి వల్లే ఈ ప్రాజెక్ట్ రూపొందింది. మనం ఎంతమంచి కథ రాసినా, అది పర్ ఫార్మ్ చేసే ఆర్టిస్టులు కావాలి. ఒక నాటకం చూసి ఈ కాస్టింగ్ అందరినీ సెలెక్ట్ చేసుకున్నాను. వాళ్లంతా అద్భుతంగా పర్ ఫార్మ్ చేశారు. టెక్నికల్ గా ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేశారు. ఈ మూవీ చూస్తూ ఆ ప్రపంచంలోకి వెళ్తారు. ఎంటర్ టైన్ మెంట్, సస్పెన్స్ తో పాటు ఎమోషన్ కు గురవుతారు. "తిమ్మరాజుపల్లి టీవీ" ప్రపంచం మీ అందరినీ ఆకట్టుకుంటుంది. అన్నారు.
హీరో సాయి తేజ్ మాట్లాడుతూ - ఈ సినిమా నుంచి సాంగ్స్ రిలీజ్ అవుతుంటే మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు అని మా ఫ్రెండ్స్ అడిగేవారు. ఏప్రిల్ 17న మీ అందరి ముందుకు వస్తున్నాం. ఈ సినిమా చూస్తున్నంతసేపు మీరు ఆ తిమ్మరాజుపల్లిలోనే ఉంటారు. ఎంటర్ టైన్ అవుతారు. ఈ చిత్రంలో సతీష్ అనే క్యారెక్టర్ చేశాను. కిరణ్ అన్న చేసిన సినిమాలకు అసిస్టెంట్ కెమెరామెన్ గా వర్క్ చేశారు. లాక్ డౌన్ టైమ్ లో ఒకరోజు కిరణ్ అన్న ఏం కావాలనుకుంటున్నావ్ అని నన్ను అడిగారు. హీరో కావాలనేది నా డ్రీమ్ అని చెప్పాను. సరే టైమ్ వచ్చినప్పుడు చేద్దువు అన్నారు. ఆయన అప్పుడు ఇచ్చిన మాట నా జీవితంలో మర్చిపోలేను. ప్రొడక్షన్ స్టార్ట్ చేశాక ఆడిషన్ ఇవ్వు అని చెప్పారు. వెళ్లి మునిరాజు గారికి ఆడిషన్ ఇచ్చాను. ఆయన హీరో క్యారెక్టర్ కు నన్ను సెలెక్ట్ చేశారు. ఈ మూవ్ మెంట్ నా జీవితాంతం సెలబ్రేట్ చేసుకుంటాను. అన్నారు.
చిత్ర నిర్మాత, హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ '' మనం సెటిలైనరోజు వీలైనంత కొత్త వాళ్లకు సపోర్ట్ చేద్దామనే హోప్ ఉండేది. నా చిన్నప్పుడు మా ఊరిలో ఒకే టీవీ ఉండేది. ఊరి వాళ్లంతా ఆ ఇంటికి వెళ్లి టీవీ చూసేవారు. అలాంటి సంఘటన ముని వాళ్ల ఊరిలో ఒకటి జరిగింది. శివరాత్రి పండక్కి మూడు రోజులు టీవీ అద్దెకు తీసుకొచ్చి ఊరి వాళ్లంతా కలిసి సినిమాలు చూస్తూ సెలబ్రేట్ చేసుకున్నారట. ఈ కథంతా 95 సంవత్సరంలో జరుగుతుంది. ఈ కథ చెప్పినప్పుడే ముని క్లియర్ గా చెప్పాడు. సార్ నేను ఎంటర్ టైన్ మెంట్, కమర్షియల్ మూవీ చేయాలనుకోవడం లేదు. మా ఊరిలో నేను చూసిన మనుషులు ఇన్నోసెన్స్, వాళ్ల మధ్య జరిగే డ్రామా, టీవీకి అప్పట్లో ఉన్న ప్రాధాన్యత నేపథ్యంగా సినిమా చేస్తానని చెప్పాడు. ఇది ఫ్యూర్ గా హానెస్ట్ గా మేమంతా చేసిన ప్రయత్నం. చిన్న బడ్జెట్ లో చిన్న స్టోరీ లైన్ తో మేము చేసిన చిత్రమిది. ఏప్రిల్ 17న సినిమా రిలీజ్ చేస్తున్నాం. ఈ సమ్మర్ హాలీడేస్ లో మీరు మా మూవీ చూస్తూ ఆ ఊరు ప్రజల క్యారెక్టర్స్ తో కనెక్ట్ అవుతారు, వారి ఇన్నోసెన్స్ ఫీల్ అవుతారు. మా సంస్థలో మరో రెండు చిత్రాలు చేస్తున్నాం. ఆ సినిమాలతో హీరోలుగా, నటీనటులుగా కొత్త వాళ్లకు అవకాశాలు కల్పిస్తున్నాం. చిన్న స్థాయిలో ఉన్న వారికి నాకు వీలైనంత అవకాశం కల్పించాలని అనుకుంటున్నా. అన్నారు.