ఫాంట‌సీ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘రాకాస‌’ తెలుగు రాష్ట్రాల హ‌క్కుల‌ను భారీ మొత్తానికి సొంతం చేసుకున్న శ్రీ లక్ష్మీ న‌ర‌సింహ మూవీ మేక‌ర్స్‌

ఫాంట‌సీ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘రాకాస‌’ తెలుగు రాష్ట్రాల హ‌క్కుల‌ను భారీ మొత్తానికి సొంతం చేసుకున్న శ్రీ లక్ష్మీ న‌ర‌సింహ మూవీ మేక‌ర్స్‌
ఏప్రిల్ 3న రిలీజ్ కానున్న ఫ్యాన్సీ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘రాకాస‌’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రారంభం నుంచి వైవిధ్యమైన కంటెంట్, ప్రమోషనల్ ప్లానింగ్‌తో ఈ సినిమా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్‌కు ముందే జ‌రిగిన థియేట్రిక‌ల్ బిజినెస్ డీల్ ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణల్లో ఈ సినిమా థియేట్రిల్ రైట్స్‌ను శ్రీ ల‌క్ష్మి న‌ర‌సింహ మూవీ మేక‌ర్స్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నారు. దీంతో సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేష‌న్స్ ఏంటో తెలుస్తుంది. సినిమాకు థియేట‌ర్స్‌లో మంచి ఆద‌ర‌ణ ద‌క్కుతుంద‌ని ట్రేడ్ స‌ర్కిల్స్ భావిస్తున్నాయి. 

https://www.instagram.com/p/DV7yJoikar4

రాకాస సినిమా విడుదలకు సిద్ధమవుతోన్న‌ సమయంలో ఈ లేటెస్ట్ డీల్‌తో ‘రాకాసా’ చిత్రానికి డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ మరింత బలపడింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ విడుదల చేస్తుండ‌గా.. ఓవ‌ర్‌సీస్‌లో మేక‌ర్స్ భారీ స్థాయిలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అథ‌ర్వ‌ణ భ‌ద్ర‌కాళి పిక్చ‌ర్స్ ఈ సినిమా అంతర్జాతీయ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలను నిర్వ‌హిస్తోంది. ఈ సంస్థ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్, యూరప్, కెనడా, ఆస్ట్రేలియా వంటి కీలక ప్రాంతాల్లో కలిపి 350కు పైగా అంతర్జాతీయ స్క్రీన్లలో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేసింది. ముఖ్యంగా నార్త్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మార్కెట్లలో డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలను ప్రత్యంగిరా సినిమాస్ చేపట్టింది. విదేశీ ప్రేక్షకుల కోసం ప్రీమియర్ షోలు 2026 ఏప్రిల్ 2న ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. ఆ తర్వాతి రోజు సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ విష‌యాల‌తోనే కాకుండా ఈ సినిమాకు నాన్ థియేట్రికల్ రంగంలో కూడా మంచి డీలింగ్స్‌ కుదిరాయి. మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకోగా..ఆడియో హక్కులను సారెగ‌మ‌ దక్కించుకుంది. భారతదేశంలో ప్రముఖ మ్యూజిక్ లేబుల్స్‌లో ఒకటైన సారెగ‌మ‌ ఈ హక్కులను పొందడం విశేషం. ఈ రెండు డీలింగ్స్ చూస్తే ఇది  సినిమాకు బిజినెస్ ప‌రంగా మరింత బలం చేకూర్చడమే కాకుండా..ప్రాజెక్ట్‌పై పెరుగుతోన్న ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను తెలియ‌జేస్తున్నాయి. 

‘రాకాస’ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల‌కు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో రెస్పాన్స్ సూప‌ర్బ్‌గా ఉంది. ఇటీవ‌లే విడుద‌లైన మూవీ టైటిల్ గ్లింప్స్ ఇప్పటికే 1.9 మిలియన్ వ్యూస్‌ను రాబ‌ట్టుకోగా, టీజర్ 2.8 మిలియన్ వ్యూస్ దాటి ఆన్‌లైన్‌లో ఆడియెన్స్‌ను నుంచి మంచి స్పంద‌న‌ను రాబ‌ట్టుకుంటోంది. పాటల విషయానికి వ‌స్తే.. ఈ మూవీ మొదటి పాట ‘ర‌ప‌ప్పా’ ప్రేక్షకులను ఆకట్టుకుని యూట్యూబ్‌లో 1.1 మిలియన్ వ్యూస్ దాటింది. ఇటీవల విడుదలైన రెండో పాట ‘పదే పదే’ను సింధూజ శ్రీనివాసన్ ఆలపించగా దీానికి కిట్టు విస్సాప్రగడ సాహిత్యాన్ని అందించారు. ఈ పాట కూడా ఇప్పటికే 1 మిలియన్ వ్యూస్ మార్క్‌ను దాటింది. ఈ సినిమాకు అనుదీప్ దేవ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ‘రాకాస’ ఆల్బమ్ చార్ట్‌బస్టర్‌గా మారే దిశగా దూసుకెళ్తోంది.  

మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాల‌తో యువ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించిన సంగీత్ శోభ‌న్ ‘రాకాస’ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయనకు జోడీగా న‌య‌న‌ర్ సారిక‌ కనిపించనున్నారు. ప్రేమ, హాస్యం, ఫాంటసీ అంశాలు కలగలిపిన కథతో ఈ సినిమా రూపొందింది. ఇంకా ఈ చిత్రంలో వెన్నెల కిషోర్‌, బ్ర‌హ్మాజీ, త‌నికెళ్ల భ‌ర‌ణి, ఆశిష్ విద్యార్థి, గెట‌ప్ శ్రీను త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఈ సినిమాకు మాన‌స శ‌ర్మ కథ‌ను అందించ‌టంతో పాటు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆమె ముందు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్ సిరీస్‌కు క్రియేటర్, రైటర్‌గా గుర్తింపు పొందారు. తర్వాత బెంచ్ లైఫ్‌ అనే ప్రాజెక్ట్‌ను కూడా డైరెక్ట్ చేశారు.

ఈ సినిమాకు మంచి టెక్నిక‌ల్ టీమ్‌కు తోడ్పాటునందిస్తోంది. ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ సంగీతాన్ని స‌మ‌కూరుస్తుండ‌గా రాజు ఎదురోలు సినిమాటోగ్ర‌పీ అందిస్తున్నారు. అన్వ‌ర్ అలీ ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. నిహారిక, జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో త‌న పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి ‘రాకాస’ మూవీని నిర్మిస్తున్నారు. 

దేశీయంగా, ఓవ‌ర్సీస్‌లో మంచి డిస్ట్రిబ్యూష‌న్ స‌పోర్ట్ దొర‌క‌టంతో పాటు ప్రమోషనల్ కంటెంట్‌కు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో పెరుగుతోన్న‌ స్పందన, అలాగే సినిమా సంగీతం, కథపై ప్రేక్షకుల్లో పెరుగుతున్న ఆసక్తి కారణంగా ‘రాకాస’ సినిమా విడుదలకు ముందే మంచి హైప్‌ను సొంతం చేసుకుంటోంది. ఈ భారీ అంచ‌నాల న‌డుమ ‘రాకాస’ చిత్రం ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అవుతోంది.
Rakasa
Tollywood
Movie News

More Press News