‘కార్మేని సెల్వం’ టీజర్ విడుదల

‘కార్మేని సెల్వం’ టీజర్ విడుదల
పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై  అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో   తెలుగు, తమిళ భాషల్లో  రూపొందుతున్న  ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’.  విలక్షణ నటులు సముద్రఖని ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్  ఇతర పాత్రలు పోషిస్తున్నారు. 

ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో  గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది.  ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ఈ చిత్రం థియేటర్స్ లోకి రాబోతుంది. ఆధునిక కాలానికి అనుసంధానమైన ఈ కథ ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో మంచి ఆసక్తిని పెంచగా.. గురువారం తెలుగు టీజర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. 

 "డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి" అని సముద్రఖని వాయిస్ ఓవర్ తో ప్రారంభమైన టీజర్ సినిమాపై క్యూరియాసిటిని పెంచుతుంది.  అధిక ఖర్చులు, భారీ లోన్లు, క్రిప్టో పెట్టుబడులు, త్వరగా ధనవంతులు కావాలనే ఆశతో చేసే ప్రయత్నాలు వంటి విషయాలను వివిధ కోణాల్లో చూపిస్తూ నేటి సమాజంలో డబ్బు పట్ల ఉన్న ఆలోచనలను చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. 

ముఖ్యంగా ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్  ఆధారిత జీవనశైలి, డబ్బు కోసం మనుషులు తీసుకునే నిర్ణయాలు కథలో కీలక పాత్ర పోషించబోతున్నాయని అర్థమవుతుంది. సముద్రఖని కుటుంబంతో కనిపించే సన్నివేశాలు హృదయానికి హత్తుకునేలా ఉంటాయి. లక్ష్మీ ప్రియా చంద్రమౌళి ఆయన భార్యగా, చిన్న కుమారుడితో కుటుంబ జీవితం చూపిస్తుండగా, మరోవైపు విదేశాల్లో ఒంటరిగా కనిపించే కొన్ని షాట్లు కథపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. గౌతమ్ వాసుదేవ్ మీనన్ పాత్రను గోప్యంగా ఉంచడం కూడా ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతోంది.

టీజర్ చివర్లో..“రిచ్ కావాలంటే రిచ్ మనిషిలా ఖర్చు చేయడం నేర్చుకోవాలి… డబ్బు లేకపోతే అప్పు తీసుకుని ఖర్చు చేయాలి” — అని సముద్రఖని చెప్పే డైలాగ్ప్రే క్షకులలో ఆలోచన రేకెత్తించేలా నిలుస్తుంది.


 
Carmeni Selvam
Carmeni Selvam teaser
Tollywood
Kollywood
samudra kani

Watch Today's Deals on Amazon

More Press News