సెవెన్ ఓక్స్ మల్టీ స్పెషాలిటీ పెట్ హాస్పిటల్ ప్రారంభం

సెవెన్ ఓక్స్ మల్టీ స్పెషాలిటీ పెట్ హాస్పిటల్ ప్రారంభం
ఇప్పటికే జుబ్లీహిల్స్, కొంపల్లిలో సక్సెస్ ఫుల్ గా ఆస్పత్రులు నిర్వహిస్తున్న సెవెన్ ఓక్స్ మల్టీ స్పెషాలిటీ పెట్ హాస్పిటల్ ఎల్బీ నగర్ లో కొత్త బ్రాంచ్ ను ఏర్పాటు చేసింది. ఎల్బీ నగర్ లో సెవెన్ ఓక్స్ మల్టీ స్పెషాలిటీ పెట్ హాస్పిటల్ ను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ ఎంపీ డా.రంజిత్ రెడ్డి  ప్రారంభించారు. ఈ ఆస్పత్రిలో పెంపుడు జంతువులకు అంతర్జాతీయ స్థాయిలో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభోత్సవంలో ఆస్పత్రి ఫౌండర్ & ఛైర్మన్ డా. శ్రీ రెడ్డి, ఎండీ సంధ్య బి. రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా

సెవెన్ ఓక్స్ మల్టీ స్పెషాలిటీ పెట్ హాస్పిటల్ ఫౌండర్ & ఛైర్మన్ డా. శ్రీ రెడ్డి మాట్లాడుతూ - రెండేళ్ల క్రితం మేము జుబ్లీహిల్స్ లో  సెవెన్ ఓక్స్ మల్టీ స్పెషాలిటీ పెట్ హాస్పిటల్ ప్రారంభించాము. ఆరు నెలల క్రితం కొంపల్లిలో బ్రాంచ్ స్థాపించాం. ఇప్పుడు ఎల్బీనగర్ లో మా హాస్పిటల్ స్టార్ట్ చేయడం హ్యాపీగా ఉంది. మా ఆస్పత్రి ప్రారంభోత్సవానికి అతిథులుగా వచ్చిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ ఎంపీ డా.రంజిత్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. డాగ్స్, క్యాట్స్, రాబిట్స్..ఇలా స్మాల్ యానిమల్స్ అన్నింటికీ మేము అత్యాధునిక వైద్య సేవలు అందిస్తాం. 

దేశంలో ఫస్ట్ టైమ్ మా హాస్పిటల్ లోనే పెంపుడు జంతువులకు ఎంఆర్ఐ స్కానింగ్ అందుబాటులోకి తీసుకొచ్చాం. ఇప్పటిదాకా మనుషులకు పరీక్షలు చేసే యంత్రాలు, పరికరాలతోనే జంతువులకు వైద్య పరీక్షలు చేసేవాళ్లు. కానీ మా హాస్పిటల్ లో పెట్స్ కోసం ప్రత్యేకంగా రోగ నిర్థారణ పరికరాలు, యంత్రాలు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నాం. ఒక మనిషికి ఎలాగైతే మల్టీస్పెషాలిటీ వైద్యం చేస్తారో, అలాగే మా ఆస్పత్రిలో పెంపుడు జంతువులకు వైద్యం అందిస్తాం. మేము లాభాపేక్ష లేకుండా ఈ ఆస్పత్రిని నిర్వహిస్తున్నాం. మాకు వచ్చే ఆదాయాన్ని హెర్మాయిన్ డంకన్ రెడ్డి ఫౌండేషన్ కు విరాళం ఇస్తున్నాం. జీహెచ్ఎంసీతో కలిసి వీధి జంతువులకు వ్యాక్సినేషన్, ఆహారం, వసతి కల్పించే కార్యక్రమాలు నిర్వహించాం. అన్నారు.

డా. సంధ్య బి. రెడ్డి మాట్లాడుతూ - ఆర్థికంగా బలహీనమైనవారి పెంపుడు జంతువులకు హెర్మాయిన్ డంకన్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఉచితంగా లేదా 50% రాయితీతో వైద్యం అందిస్తున్నాం. ఎక్కడైనా వీధి జంతువులు అనారోగ్యంతో కనిపిస్తే మా ఆస్పత్రికి తీసుకురావాలని ఎన్ జీవోస్ కు విజ్ఞప్తి చేస్తున్నాం. మా ఫౌండేషన్ ద్వారా సగం ఖర్చుతోనే వైద్య సహాయం అందిస్తాం. అన్నారు.
Seven Oaks Pet Hospital
Hyderabad

More Press News