'హుషారు పిట్టలు' చిత్రం నుంచి 'మంగళస్నానం' లిరికల్ సాంగ్ విడుదల
అన్షు, వాసవి గణేషన్ జంటగా రూపొందుతోన్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం 'హుషారు పిట్టలు'. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ పతాకంపై వెంకట్ యాదవ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బిక్షు దర్శకుడు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఏషియన్ సురేష్ ఫిలింస్ సంస్థలు విడుదల చేస్తున్నాయి. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం టీజర్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. కాగా ఈ చిత్రం నుంచి తాజాగా మంగళస్నానం అనే హార్ట్ టచ్చింగ్ ఎమోషనల్ సాంగ్‌ను విడుదల చేశారు.
ఓ తండ్రి తన కూతురును ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుంటాడో, ఆమెపై ప్రాణాలు పెట్టుకుని ఎలా ఉంటాడో ఈ పాటలో తెలుస్తుంది. తండ్రి కూతుళ్ల అనుబంధంతో ఈ పాట ఉంటుంది. ఎస్ఎస్ చిరంజన్ ఈ పాటకు సాహిత్యం అందించగా యోగి సురేష్, విహా ఈ గీతాన్ని ఆలపించారు. చరణ్ అర్జున్ సంగీతాన్ని అందించారు. త్వరలోనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసందర్బంగా దర్శకుడు మాట్లాడుతూ '' తండ్రి కూతుళ్ల మధ్య ఉండే అప్యాయత అనుబంధం తెలియజేసే పాట ఇది. ఈ సినిమా యువతీ యువకులు, వారి తల్లిదండ్రులు విడి విడిగా చూడాల్సిన కుటుంబ కథా చిత్రం. తప్పకుండా నేటి యువతకు హుషారు తెప్పిచే చిత్రం ఇది. నా రియల్‌లైఫ్‌లో నా చుట్టుప్రక్కల జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశాను. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా చూసిన తరువాత అందరూ థ్రిల్ల్ అయ్యి షాక్ అయ్యి ఔట్ అవుతారు' అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ '' ఫస్టాఫ్ యూత్‌ఫుల్ కంటెంట్‌తో వెళ్లిన సెకండాఫ్‌లో ఓ మెచ్యూర్డ్ కంటెంట్ ఉంది. ఇది డెఫినెండ్‌గా మంచి సినిమా. ఈ సినిమా ద్వారా యూత్‌కు, తల్లిదండ్రులకు దర్శకుడు ఏదో విషయం చెబుతున్నాడు. ఈసినిమా చూసిన తరువాత అందరూ రెస్పాన్సబుల్‌గా ఫీలవుతారు. ఓ మంచి విషయాన్ని ఓ ఎంటర్టైన్మెంట్ వేలో ఈ సినిమాలో దర్శకుడు చెప్పాడు. ఆర్టిస్టులు కూడా ఎంతో నేచురాల్‌గా ఉంటుంది. ఖచ్చితంగా ఇది సక్సెస్ఫుల్ సినిమా' అన్నారు.
అన్షు, వాసవి గణేషన్, గోవర్థన్, సునీత్ మనోహర్, రమేష్, బలగం బాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చరణ్-అర్జున్