'హే భగవాన్‌' ట్రైలర్‌ విడుదల!

'హే భగవాన్‌' ట్రైలర్‌ విడుదల!
 బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం తాజాగా నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై ‘హే భగవాన్‌’ అనే ఫుల్‌లెంగ్త్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రంలో సుహాస్, శివానీ నగరం, సీనియర్ నటుడు నరేష్, యాంకర్ స్రవంతి ప్రముఖ పాత్రల్ని పోషించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌ విజనరీ స్టూడియోస్‌ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని ఫిబ్రవరి 20న రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం హైదరాబాద్‌లో నాట్ ఏ ట్రైలర్ పేరుతో    ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మెగా సుప్రీమ్‌ హీరో సాయి దుర్గ తేజ్ ట్రైలర్‌‌ను విడుదల చేశారు. 

ఈ సందర్భంగా సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ..‘‘ఈ మూవీ ట్రైలర్ చాలా బాగుంది. ప్రేక్షకులకు నవ్వులు పంచేలా ఈ  సినిమా ఉంటుంది. సుహాస్ చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. తెలుగు సినిమాలతోపాటు తమిళ మూవీస్‌లోనూ సత్తా చాటుతున్నాడు. ‘హే భగవాన్’  చిత్రం అందర్నీ ఎంటర్‌‌టైన్ చేస్తుంది. ఈ సినిమా  టీమ్ అందరికీ పెద్ద విజయం తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నా”అని చెప్పారు.   

మరో అతిథిగా హాజరైన  డైరెక్టర్ రామ్ అబ్బరాజు మాట్లాడుతూ.. ‘‘మంచి యూనిక్ పాయింట్ తో  రాబోతున్న ఈ చిత్రం అందర్నీ ఎంటర్‌‌టైన్ చేస్తుంది.  సుహాస్‌ కెరీర్‌‌లో ‘హే భగవాన్’  మరో హిట్ మూవీగా నిలుస్తుందని నమ్ముతున్నా. టీమ్‌ అందరికీ ఈ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నా”అని అన్నారు. 

బన్నీ వాస్ మాట్లాడుతూ ..‘‘ఈ సినిమా కథతోపాటు టీమ్‌తోనూ మొదటి నుంచి ఇన్‌వాల్వ్‌ అవుతూ వచ్చిన వంశీ నందిపాటికి ముందు క్రెటిడ్ ఇవ్వాలి. రీసెంట్‌గా ఫస్ట్ కాపీ చూశాను. చాలా బాగా నవ్వుకున్నాను. నా సినిమా కాకుండా బయట సినిమా బాగా నవ్వానంటే అది తప్పు చేయదు. చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయడంలో సాయి దుర్గ తేజ్ ఎప్పుడూ ముందుంటారు. చాలా కష్టపడి ఒక్కో స్టెప్ ఎదుగుతూ వస్తున్నాడు  సుహాస్. ఈ సినిమా కూడా కచ్చితంగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్‌’’ అని చెప్పారు. 

వంశీ నందిపాటి మాట్లాడుతూ..‘‘కొన్ని కథలకు ట్రైలర్‌‌లు చూపించలేం. ఈ కథను థియేటర్‌‌లోనే  చూడాలి. అందుకే నాట్ ఏ ట్రైలర్ పేరుతో ఈవెంట్‌ నిర్వహిస్తున్నాం. ఈ కథను ఊహించిన వారికి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో టాప్ ఐదుగురికి  రూ.20వేలు ప్రైజ్ మనీ ఇవ్వబోతున్నాం.  ఫిబ్రవరి 20న కచ్చితంగా హిట్ కొట్టబోతున్నాం. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన సాయి దుర్గ తేజ్ గారికి, రామ్ అబ్బరాజు గారికి  థ్యాంక్స్. నిన్ననే సెన్సార్ పూర్తయింది. వాళ్లు చాలా బాగా ఎంజాయ్ చేశామని చెప్పారు. సుహాస్‌ కెరీర్‌‌లో ఇది పెద్ద హిట్ అవబోతుంది. నార్త్ అమెరికాలో వన్ మిలియన్ క్రాస్ చేసిన హీరోగా రికార్డ్ క్రియేట్ చేస్తాడని నమ్ముతున్నా”అని అన్నారు. 

హీరో సుహాస్ మాట్లాడుతూ..‘‘ఇది అవుట్ అండ్ అండ్ కామెడీ ఎంటర్‌‌టైనర్.  ప్రేక్షకులు గట్టిగా ఎంజాయ్  చేస్తారు. నరేష్ గారితో వర్క్ చేయడం హ్యాపీ. క్లైమాక్స్‌లో ఆయన యాక్టింగ్ నెక్స్ట్ లెవల్‌లో ఉంటుంది. తేజ్ అన్న నాకు ఎప్పుడూ సపోర్ట్‌గా నిలుస్తారు. నా ప్రతి సినిమాకు ఆయన విషెస్ తెలియజేస్తుంటారు. నేను ఇండస్ట్రీకి రావడానికి కూడా మా పేరెంట్స్‌ను ఒప్పించి  నన్ను ఆయన  ఎంకరేజ్ చేశారు. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో  ‘అంబాజీపేట’తో హిట్ కొట్టాం. ఈ సినిమా కూడా హిట్ అవుతుందని నమ్మకం ఉంది”అని అన్నారు.   

శివానీ నాగారం మాట్లాడుతూ..‘‘మాకు పాజిటివ్‌ సపోర్ట్‌గా నిలిచిన స్పెషల్ గెస్ట్‌ సాయి తేజ్ గారికి స్పెషల్ థ్యాంక్స్. టీమ్ అంతా చాలా కష్టపడి ఇష్టంతో ఈ సినిమా చేశాం. ఇందులో కామెడీ, లవ్, ఎమోషన్ సహా అన్ని ఎలిమెంట్స్ ఉన్న  ఉగాది పచ్చడిలాంటి సినిమా ఇది. కచ్చితంగా అందరూ ఎంటర్‌‌టైన్ అవుతారు”అని చెప్పారు.  
 
నటులు వీకే నరేష్ మాట్లాడుతూ..‘‘ఇదొక హోల్సమ్ ఎంటర్‌‌టైనర్. కొత్తదనం కోరుకునే రివ్యూవర్స్‌కు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది.  ఫాదర్ అండ్ సన్ ఎమోషన్‌తో సరికొత్తగా ఉంటుంది” అని అన్నారు. 

దర్శకుడు గోపీ అచ్చర మాట్లాడుతూ..‘‘మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన సాయి దుర్గ తేజ్ గారికి, డైరెక్టర్ రామ్ అబ్బరాజుకి స్పెషల్ థ్యాంక్స్. సాధారణంగా  ట్రైలర్స్‌లో మూవీ పాయింట్‌ను టచ్ చేస్తారు. కానీ   ఈ చిత్రంలోని మెయిన్ పాయింట్‌ను సినిమాలోనే చూపించాలని, నాట్ ఏ ట్రైలర్‌‌ పేరుతో ట్రైలర్‌‌ను రిలీజ్ చేశాం.  ఫాదర్ అండ్ సన్ ఎమోషన్‌తో సాగే స్టోరీ ఇది. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా. మేకింగ్‌లో మాకు అన్ని విధాలా సపోర్ట్ చేసిన  నిర్మాత బి నరేంద్ర రెడ్డికి థ్యాంక్స్. ఈ మూవీలో వంశీ నందిపాటి, బన్నీ వాస్ పార్ట్ అయినప్పట్నంచీ మాకు మరింత ప్లస్ అయ్యింది. సుహాస్‌కు ఫిబ్రవరి కలిసొచ్చే నెల. ఆయన నటించిన గత రెండు సినిమాలు ఫిబ్రవరిలోనే వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఈ సినిమాతో  హ్యాట్రిక్  కొట్టబోతున్నారు. నరేష్ సర్ సెట్స్‌లో జాయిన్ అవ్వగానే టీమ్ అందరికీ ఎనర్జీ వచ్చింది. చిత్రంలోని పాత్రలన్నీ అందర్నీ అలరిస్తాయి”అని చెప్పారు. 

కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత బి నరేంద్ర రెడ్డి,  సుదర్శన్,  స్రవంతి చొక్కాపు, రైటర్ ప్రశాంత్,   డీవోపీ మహి రెడ్డి, ఎడిటర్ విప్లవ్, మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ ఈ ప్రాజెక్ట్‌లో భాగమవడం చాలా ఆనందంగా ఉందని, ఈ చిత్రం కచ్చితంగా విజయవంతం అవుతుందని నమ్మకం వ్యక్తం చేశారు.


Hey Bhagawan
suhas
shivani nagaram
tollywood

More Press News