Sri Chidambaram Garu: ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా 'శ్రీ చిదంబరం గారు'..

ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా 'శ్రీ చిదంబరం గారు' విడుదల

ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా  'శ్రీ చిదంబరం గారు' విడుదల
శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మాతలుగా చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా వినయ్ రత్నం తెరకెక్కించిన చిత్రం ‘శ్రీ చిదంబరం’. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత వంశీ నందిపాటి థియేట్రికల్‌ రిలీజ్‌ చేస్తున్నారు. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన ఈ చిత్రం నుంచి  ఇటీవల టీజర్‌ను విడుదల చేశారు.  కాగా ఈ చిత్రంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్‌ కీరవాణి గారు ఆలపించిన 'వెళ్లేదారిలో' అనే ఓ పాట బ్యూటిఫుల్‌ పాటను కూడా  ఇటీవల  విడుదల చేసిన సంగతి తెలిసిందే. 

ఈ పాట సక్సెస్‌ సెలబ్రేషన్స్‌తో పాటు చిత్ర విడుదల తేది ప్రకటన ప్రెస్‌మీట్‌ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా చిత్రాన్ని ఫిబ్రవరి 6న ప్రపంచ వ్యాప్తంగా థ్రియేట్రికల్‌ విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు మేకర్స్‌. ఈ సందర్భంగా ఈ వేడుకకు ముఖ్య అథిగా విచ్చేసిన  ఆర్‌పీ పట్నాయక్‌ మాట్లాడుతూ '' యంగ్‌ టీమ్‌ చేసిన బ్యూటిఫుల్‌ సినిమా ఇది. చాలా మెచ్యూర్డ్‌ అండ్‌ ఇన్‌స్పిరేషన్‌ స్టోరీతో రాబోతున్న సినిమా ఇది. 

నేటి సమాజానికి ఎంతో అవసరమైన కథ ఇది. చాలా మంది యువత చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌కే సూసైడ్‌ వరకు వెళ్లిపోతున్నారు. అలాంటి వారందరికి ఎంతో ఇన్‌స్పయిర్‌ అయ్యే కథ ఇది. మీలో లోపం మీకు బలం అవ్వాలి అనే చెప్పే కథ ఇది.  నిర్మాత గోపాలకృష్ఱ మాట్లాడుతూ కొత్తవాళ్లను ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో నేను చేసిన ఐదో సినిమా ఇది. ప్రొడక్షన్‌ వాల్యూస్‌ గురించి రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించాను. ఓ పెద్ద సినిమాకు తీసిపోని సినిమా. వంశీ నందిపాటి ఈ సినిమాకు మొదట్నుంచీ సపోర్ట్‌ చేశారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆయనే సినిమాను పంపిణి చేస్తున్నారు. కంటెంట్‌ ఉన్న గొప్ప సినిమా ఇది. నిర్మాతగా నేను ఎంతో ఇష్టపడి చేసిన సినిమా ఇది' అన్నారు. 

దర్శకుడు  వినయ్‌ రత్నం మాట్లాడుతూ '' ఈ సినిమా కార్యరూపం దాల్చడానిక ప్రధాన కారణం మా నిర్మాత గోపాల కృష్ణ గారు. ఈ సినిమాలో ప్రతి సాంగ్‌ అందరి హృదయాలకు హత్తుకుంటుంది. సినిమాను ఫైనల్‌ మిక్సింగ్‌లో చూసుకుని ఏడ్చాను. చాలా కష్టపడి సినిమా తీశాం. అందరూ సపోర్ట్‌ చేస్తారని అనుకుంటున్నాను అన్నారు.
Sri Chidambaram Garu
Chinta Gopala Krishna Reddy
Vamsi Tummala
tollywood
Movie News

Watch Today's Deals on Amazon

More Press News