జీ తెలుగులో 'ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఈ నెల‌ 14న సాయంత్రం 6:30 గంటలకు!

జీ తెలుగులో 'ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఈ నెల‌ 14న సాయంత్రం 6:30 గంటలకు!
విభిన్నమైన ఫిక్షన్, నాన్-ఫిక్షన్ షోలతో పాటు బ్లాక్‌బస్టర్ సినిమా ప్రీమియర్‌లతో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు అలరిస్తున్న జీ తెలుగు, ఇప్పుడు సరికొత్త సినిమా వినోదాన్ని అందించడానికి సిద్ధమైంది. అద్భుతమైన కామెడీ-డ్రామా చిత్రం 'ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ను డిసెంబర్ 14, ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు ప్రసారం చేయనుంది. ఆకట్టుకునే కథాంశం, అద్భుతమైన నటన, ఆకర్షణీయమైన విజువల్స్‌తో ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం, తెలుగు సినీ ప్రియులకు మరపురాని అనుభూతిని ఇవ్వడం ఖాయం.

రమేష్ (తిరువీర్), తన స్నేహితుడు రామ్ చరణ్ (మాస్టర్ రోహన్ రాయ్)తో కలిసి ఒక ఫోటో స్టూడియో, జిరాక్స్ షాప్‌ను నడుపుతుంటాడు. తన షాప్ ఎదురుగా ఉన్న పంచాయతీ కార్యాలయంలో పనిచేసే హేమ (టీనా శ్రావ్య) పట్ల రమేష్ ప్రేమను పెంచుకుంటాడు. ఒకరోజు, రాజకీయంగా పలుకుబడి ఉన్న ఆనంద్ (నరేంద్ర రవి) తన ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం రమేష్‌ను సంప్రదిస్తాడు. షూట్ సజావుగా పూర్తవుతుంది, కానీ రామ్ చరణ్ నిర్లక్ష్యం కారణంగా, ఆ ఫుటేజ్ ఉన్న మెమొరీ కార్డు పోతుంది. పోయిన చిప్‌ను రికవరీ చేయడానికి రమేష్ చేసిన ప్రయత్నాలు, వాటి వల్ల ఏర్పడిన గందరగోళమే ఈ సినిమా కథాంశం.
ఈ సినిమాలో తిరువీర్, టీనా శ్రావ్య ప్రధాన పాత్రలు పోషించగా, మాస్టర్ రోహన్ రాయ్, నరేంద్ర రవి కీలక పాత్రలలో కనిపించారు. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో సినిమా, ఆకట్టుకునే కథ, అలరించే హాస్యంతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ కామెడీ ఎంటర్టైనర్ని జీ తెలుగు వేదికగా ఈ ఆదివారం మీరూ చూసేయండి!
The Great Pre Wedding Show
Telugu Cinema
Tollywood

Watch Today's Deals on Amazon

More Press News